Watermelon : వామ్మో… ఫ్రిడ్జ్ లో ఉంచిన పుచ్చకాయని తింటున్నారా..? మహా డేంజరట..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Watermelon : వామ్మో… ఫ్రిడ్జ్ లో ఉంచిన పుచ్చకాయని తింటున్నారా..? మహా డేంజరట..!

Watermelon : వేసవి కాలంలో ఏది తిన్న ఏది తాగిన చల్ల చల్లగా తినాలనిపిస్తూ.. తాగాలనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మన శరీరం చల్లగా ఉండే వాటినీ కోరుకుంటూ ఉంటుంది. అయితే ఈ వేసవిలో ఎక్కువగా పుచ్చకాయలను తింటూ ఉంటాం.. పుచ్చకాయ శరీరాన్ని చల్లబరచడానికి చాలా బాగా సహాయపడుతుంది. పుచ్చకాయలు లైకోపిన్ యాంటీ ఆక్సిడెంట్, ఎలిమెంట్స్ విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అయితే బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఈ పుచ్చకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో క్యాలరీలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 March 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Watermelon : వామ్మో... ఫ్రిడ్జ్ లో ఉంచిన పుచ్చకాయని తింటున్నారా..? మహా డేంజరట..!

Watermelon : వేసవి కాలంలో ఏది తిన్న ఏది తాగిన చల్ల చల్లగా తినాలనిపిస్తూ.. తాగాలనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మన శరీరం చల్లగా ఉండే వాటినీ కోరుకుంటూ ఉంటుంది. అయితే ఈ వేసవిలో ఎక్కువగా పుచ్చకాయలను తింటూ ఉంటాం.. పుచ్చకాయ శరీరాన్ని చల్లబరచడానికి చాలా బాగా సహాయపడుతుంది. పుచ్చకాయలు లైకోపిన్ యాంటీ ఆక్సిడెంట్, ఎలిమెంట్స్ విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అయితే బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఈ పుచ్చకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కావున ఈ పండు తీసుకోవడం వల్ల మన పొట్ట ఎక్కువ సమయం నిండుగా అనిపిస్తుంది. ఈ పండు వేసవిలో ఎండ వేడి నుంచి మన శరీరాన్ని చల్లగా ఉంటుంది.

దీనిలో 92 శాతం నీరే ఉంటుంది కావున.. మన శరీరానికి ఎక్కువ వాటర్ కంటెంట్ ఇస్తుంది. తాజా పుచ్చకాయలు సిట్రోలైన్ అనే ముఖ్యమైన ఆమైనో ఆమ్లం ఉంటుంది. ఈ సిట్రులైన నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది. దాని ఫలితంగా రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. పుచ్చకాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా పుచ్చకాయ శరీరంలో చక్కెర పరిమాణాన్ని కంట్రోల్ చేస్తుంది. డైట్ చేసే వారికి కూడా పుచ్చకాయ చాలా బాగా మేలు చేస్తుంది. అయితే కొందరు పుచ్చకాయను ఫ్రిజ్లో ఉంచి తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పోషక విలువలు తగ్గుతాయని చాలామందికి తెలియదు…సహజంగా చాలామంది మార్కెట్ నుంచి పండ్లను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు.

అయితే పండ్లను కోసి ఫ్రిజ్లో ఉంటే మాత్రం వెంటనే దాన్ని పడేయండి. ప్రధానంగా పుచ్చకాయని ఫ్రిజ్లో పొరపాటున కూడా పెట్టవద్దు. పుచ్చకాయను ఫ్రిజ్లో ఉంచడం కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎంత ఎండలోనైనా పుచ్చకాయ చాలా చల్లగా ఉంటుంది. తినడానికి రుచికరమైనది కానీ కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సహజంగా కోసిన పుచ్చకాయపై బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కాబట్టి ఫ్రిజ్లో ఉంచడం కంటే నీటిలో వేసి కొద్దిసేపు ఉంచి ఆ పుచ్చకాయని కట్ చేసుకుని తినడం చాలా మంచిది. కట్ చేసిన పుచ్చకాయని అసలు స్టాక్ ఉంచొద్దు.. అలాగే ఫ్రిజ్లో పెట్టవద్దు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది