Onions : ఉల్లిపాయలు నెలపాటు తినకుండా మానేస్తే… శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…!

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Onions : ఉల్లిపాయలు నెలపాటు తినకుండా మానేస్తే... శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా...!

Onions : ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎన్నో రకాల వంటకాలు చేస్తూ ఉంటారు. మనం ప్రతిరోజు తీసుకునే ఎన్నో వంటకాలలో ఉల్లిపాయ ఎంతో ముఖ్యమైనది. మనం ప్రతినిత్యం కూరగాయలు, బిర్యానీలు, చిరుతిళ్లు ఏది చేసినప్పటికీ కూడా వాటిలో ఉల్లిపాయ కచ్చితంగా వాడుతాము. అయితే వీటన్నిటిలో ఎక్కువగా ఉల్లిపాయలు వాడతాము. మన ఆహారంలో ఉల్లిపాయను వాడడం వలన ఆహార రుచి అనేది రెట్టింపు అవుతుంది. అయితే ఒక నెలపాటు ఈ ఉల్లిపాయలను తీసుకోకుండా ఉంటే మీ శరీరంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించారా. ఉల్లిపాయను తీసుకోకుండా ఉండడం శరీరానికి మంచిదా, చెడ్డదా.ఉల్లిపాయలు ఒక నెల రోజుల పాటు తినకుండా ఉంటే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి.దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం…

ఒక నెల రోజులపాటు ఈ ఉల్లిపాయను పూర్తిగా మానేసినట్లయితే మలబద్ధకం నుండి కంటిచూపు వరకు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే. ఈ ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎంతో సహాయం చేస్తుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ బి6 లాంటివి ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. ఈ ఫోల్లెట్ తో పాటు రొగరోధక వ్యవస్థ,కణాల పెరుగుదల, జర్ణక్రియ ప్రక్రియను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే అల్లిసీన్, క్వెర్సెటిన్ లాంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నియంత్రించడానికి మరియు దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

Onions : ఉల్లిపాయలు నెలపాటు తినకుండా మానేస్తే... శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా...!

Onions : ఉల్లిపాయలు నెలపాటు తినకుండా మానేస్తే… శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…!

Onions ఒక నెలపాటు ఉల్లిపాయకు దూరంగా ఉంటే ఏమవుతుంది

ఒక నెలపాటు ఉల్లిపాయను గనుక తినడం మానేస్తే శరీరంలో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. కానీ తప్పనిసరిగా చిన్న పాటి మార్పులు అయితే వస్తాయి అని అంటున్నారు నిపుణులు. ఈ ఉల్లిపాయలు ఎక్కువ మొత్తంలో డైటరీ,ఫైబర్ అనేది ఉంటుంది. ఇది ఆరోగ్యమైన జీర్ణవ్యవస్థకు ఎంతో ముఖ్యం. అందువలన వాటిని మానడం వలన అజీర్ణం తో పాటుగా మలబద్దకం లాంటి సమస్యలు వస్తాయి. ఇవి మాత్రమే కాక ఉల్లిపాయను తీసుకోకపోవడం వలన విటమిన్ సి,విటమిన్ b6,ఫోలేట్ లోపంతో పాటుగా మాంగనీస్, పొటాషియం, ఖనిజాలు రోగనిరోధక శక్తిని బలహీనంగా చేస్తాయి. దీని ఫలితంగా శరీరంలో అలసట అనేది పెరుగుతుంది. అలాగే ఎర్ర రక్త కణాలు కూడా ఏర్పడతాయి. అంతేకాక రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. ఉల్లిపాయలు పూర్తిగా మానెయ్యకుండా తక్కువ పరిమాణంలో తీసుకోవటం మంచిది అని నిపుణులు అంటున్నారు

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి