Onions | ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు కనిపిస్తే జాగ్రత్త.. బ్లాక్ మోల్డ్ ప్రమాదం గురించి మీకు తెలుసా?
Onions | వంటగదిలో ఉల్లిపాయలు లేకుండా వంట పూర్తి కాదు. రుచి, సువాసనను పెంచే ఉల్లిపాయలు చాలా ముఖ్యమైనవి. అయితే కొన్నిసార్లు వాటి పై పొట్టుపై నల్లటి మచ్చలు లేదా పొగమంచు లాంటి పొడి కనిపించడం గమనించారా? ఇది సాధారణంగా బ్లాక్ మోల్డ్ లేదా నల్లటి ఫంగస్ అని పిలుస్తారు. ఇది Aspergillus niger అనే ఫంగస్ వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
#image_title
ఫంగస్ ఎలా వస్తుంది?
అధిక తేమ, వేడి, గాలి సరిగా రాకపోవడం వంటి పరిస్థితుల్లో ఉల్లిపాయలను నిల్వ చేసినప్పుడు ఈ ఫంగస్ త్వరగా పెరుగుతుంది. మట్టిలో లేదా కుళ్ళిన మొక్కల భాగాల్లో ఉండే ఈ ఫంగస్ ఉల్లిపాయలపై సులభంగా వ్యాపిస్తుంది.
ఆరోగ్యంపై దుష్ప్రభావాలు
1. కాలేయం, కిడ్నీలపై ప్రభావం:
బ్లాక్ మోల్డ్ కొన్నిసార్లు మైకోటాక్సిన్‌లు విడుదల చేస్తుంది. ముఖ్యంగా ఓక్రాటాక్సిన్ A అనే టాక్సిన్ కాలేయం, మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. దీర్ఘకాలం ఈ ఫంగస్ ఉన్న ఉల్లిపాయలను వాడితే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
జీర్ణ సమస్యలు:
ఈ ఫంగస్ ఉన్న ఉల్లిపాయలను తినడం వల్ల తలనొప్పి, వాంతులు, కడుపునొప్పి, అతిసారం వంటి సమస్యలు రావచ్చు.
అలెర్జీలు మరియు శ్వాసకోశ ఇబ్బందులు:
ఉబ్బసం (ఆస్తమా), బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఈ ఫంగస్‌ను ముట్టుకుంటే లేదా వాసన పీల్చినా అలెర్జీ ప్రతిచర్యలు వచ్చే అవకాశం ఉంది.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ప్రమాదం:
ఫంగస్ ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.
ఉల్లిపాయలను వాడాలా? పారేయాలా?
వాడవచ్చే పరిస్థితి:
నల్లటి మచ్చలు కేవలం బయటి పొట్టుపై మాత్రమే ఉంటే, లోపలి పొరలు గట్టిగా, తాజాగా ఉంటే బయటి పొరను తీసేసి ఉల్లిపాయను కడిగి వాడవచ్చు.
పారవేయాల్సిన పరిస్థితి:
నల్లటి మచ్చలు లోపలి పొరల వరకూ ఉంటే, ఉల్లిపాయ మెత్తగా మారి దుర్వాసన వస్తే దాన్ని వాడకూడదు. వెంటనే పారేయాలి.