Winter Health Tips : ఈ టిప్స్‌తో చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దూరం..
Winter Health Tips : ఇతర కాలాలతో పోల్చితే చలికాలంలో కొందరు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లన కూడా కొంత ప్రభావం పడే అవకాశాలుంటాయి. ఈ క్రమంలోనే పెద్దలు సూచిస్తున్న ఈ టిప్స్ ఫాలో అయితే కనుక అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. ఆ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలడం ద్వారా మీ అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కోల్డ్, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి లీవ్స్ వాటర్ తీసుకున్నా చక్కటి ప్రయోజనాలుంటాయి.గొంతులో గరగర కూడా తొలగిపోతుంది.
ప్రతీ రోజు నైట్ టైంలో తులసి ఆకులను నీటిలో నానబెట్టుకోవాలి. అలా తులసి ఆకులున్న వాటర్‌ను ప్రతీ రోజు పరగడుపున తీసుకుంటే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి.ఇకపోతే అల్లం తీసుకోవడం వల్ల కూడా చలికాంలోనే కాదు…ఇతర కాలాల్లోనూ మంచి ప్రయోజనాలున్నాయి. అల్లం గుణాలతో ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవడంతో పాటు జలుబు, ఇతర రకాల వైరస్‌లు దరిచేరవు. గొంతు నొప్పితో బాధపడేవారికి అల్లం దివ్య ఔషధంగా పని చేస్తుంది. జలుబు, కఫం సమస్యలు పరిష్కరించుకునేందుకుగాను వాము పొడి వాడాలి. అరలీటరు తాగు నీటిలో వాము పొడి, పసుపు వేయాలి. ఇవి వేసే ముందర వాటర్‌ను వేడి చేయాలి. అవి చల్లారిన తర్వాత తేనెలో కలుపుకుని పలు మార్లు తాగితే కఫం, జలుబు ఇట్టే తగ్గిపోతుంది.
Winter Health Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. మీరు హెల్దీగా ఉండొచ్చు..
బాగా దంచిన తర్వాత వామును మజ్జిగలో కలుపుకుని తాగినా చక్కటి ప్రయోజనాలుంటాయి. ఇలా చేయడం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిది.ప్రతీ రోజు రాత్రి పడుకునే ముందర పాలల్లో కొంచెం పసుపును కలిపి తీసుకుంటే చాలా మంచిది. అలా చేయడం ద్వారా జలుబు, దగ్గు సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి. పసుపు పాలతో చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి. కఫం సమస్య ఉన్న వాళ్లు పసుపు పాలు తాగితే తొందరగా సమస్య పరిష్కారమవుతుంది. ఇకపోతే కర్పూరాన్ని నువ్వుల నూనెలో కరిగించి దానితో మసాజ్ చేసుకున్నట్లయితే ఇంకా చక్కటి ప్రయోజనాలుంటాయి. నల్లమిరియాల కషాయం కూడా చక్కటి ఔషధం. దగ్గు, జలుబు ఈ కషాయం తాగితే చాలా తొందరగా తగ్గిపోతాయి.