Hair Tips : మహిళలు తలస్నానం చేసిన వెంటనే జుట్టుకి టవల్ చుడుతున్నార..? ఎంత ప్రమాదమో తెలుసా..
Hair Tips : కొంతమంది ఆడవాళ్లు తలస్నానం చేసిన వెంటనే టవల్ చుట్టుకుంటూ ఉంటారు. అలా చుట్టుకోవడం వలన ఎంతో ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొంతమంది మహిళలు చుండ్రు, జుట్టు రాలడం, పొడిబారడం మొదలైన సమస్యలతో ఎంతో బాధపడుతున్నప్పటికీ ఈ చర్య కూడా జుట్టుకి హాని చేస్తుంది. టవల్ కట్టుకుంటే ఏం జరుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాం… జుట్టుకి టవల్ కట్టుకోవడం వల్ల కలిగే నష్టాలే ఏంటో… *శరీరంమొత్తం తుడిచిన తర్వాతే అదే టవల్తో
చుట్టుకుంటే శరీరంలోని మురికి జుట్టులోకి వెళ్తూ ఉంటుంది. *తల స్నానం చేసిన తర్వాత తలకు టవల్ చుట్టుకుంటే తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి అసలు మంచిది కాదు..*తడి జుట్టుకు టవల్ కట్టడం వల్ల అది జుట్టు సహజ షైను ను తీవ్రంగా ప్రభావం చేస్తూ ఉంటుంది. *జుట్టు రాలడం వలన ఇబ్బంది పడేవారు ఎప్పుడు అలాంటి పొరపాట్లు చేయకండి. జుట్టుకు టవల్ కట్టడం వలన జుట్టు రాలే సమస్య అధికమవుతుంది. *తలస్నానం చేసిన తర్వాత టవల్ కట్టుకోవడం వలన ఎక్కువ సేపు తడిగా ఉంటుంది.
దాని వలన చుండ్రు వచ్చే అవకాశం ఉంటుంది. జుట్టు పొడిబారాలంటే ఏం చేయాలి; జుట్టుకు టవలు కట్టుకోవడం ప్రమాదకరం అయితే ఏం చేయాలి అనే ప్రశ్న చాలా మందికి మనసులో ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణులు ప్రకారం సూర్యకాంతిలో జుట్టును ఆరబెట్టడం చాలా మంచిది. ఇంట్లో సూర్యరశ్మి లేకపోతే హెయిర్ డ్రైయిర్ కూడా వాడుకోవచ్చు. అయితే హెయిర్ డ్రైయర్ ఎక్కువగా హీట్ చేయవద్దు.. అలా చేసినట్లయితే జుట్టు రాలే సమస్య ఇంకాస్త పెరుగుతుంది. కాబట్టి జుట్టు ఎండలో నిలబడి ఆరబెట్టుకోవడం వలన జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి. జుట్టు ఊడకుండా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారాన్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి.