Heart Disease : గుండె జబ్బులు కలవారు శీతాకాలంలో పొరపాటున కూడా ఈ 4 కూరగాయలను తీసుకోవద్దు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Heart Disease : గుండె జబ్బులు కలవారు శీతాకాలంలో పొరపాటున కూడా ఈ 4 కూరగాయలను తీసుకోవద్దు…!

Heart Disease : చలికాలంలో మీ ఆరోగ్యాన్ని పాడు చేసే ఏ ఏ కూరగాయల్ని తినకూడదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ అవుతాయి. కాబట్టి మనం ఆరోగ్యకరమైన కూరగాయలను తీసుకుంటే ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. దాదాపు అన్ని కూరగాయలు ఎంతో ఆరోగ్యకరమైనవి.. అంతేకాదు మనం వాటిని ఎక్కువ పరిమాణాల్లో తీసుకున్న కూడా బరువు మాత్రం పెరగము. ఎందుకంటే చాలా కూరగాయల్లో మంచి ఫైబర్ అలాగే తక్కువ […]

 Authored By jyothi | The Telugu News | Updated on :11 January 2024,9:00 am

Heart Disease : చలికాలంలో మీ ఆరోగ్యాన్ని పాడు చేసే ఏ ఏ కూరగాయల్ని తినకూడదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ అవుతాయి. కాబట్టి మనం ఆరోగ్యకరమైన కూరగాయలను తీసుకుంటే ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. దాదాపు అన్ని కూరగాయలు ఎంతో ఆరోగ్యకరమైనవి.. అంతేకాదు మనం వాటిని ఎక్కువ పరిమాణాల్లో తీసుకున్న కూడా బరువు మాత్రం పెరగము. ఎందుకంటే చాలా కూరగాయల్లో మంచి ఫైబర్ అలాగే తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి అవి ఎంతో ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడతాయి. అయితే కొన్ని కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే చలికాలంలో మన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. రకరకాల జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. చలికాలంలో ఏ కూరగాయలు తీసుకోకూడదు.. వేటికి దూరంగా ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం..

మొక్కజొన్న కూడా అనేక ప్రయోజనాలు కలిగి ఉంది. అయినప్పటికీ కూడా తక్కువ పరిమాణాల్లో తీసుకుంటే ఎంతో మంచిది. మనకు ఎటువంటి హాని కలిగించదు. వీటిని చాలా విధాలుగా చేసి అమ్ముతూ ఉంటారు. రెడీమేడ్ గా ఉన్న వాటిని ఎక్కువ పరిమాణాల్లో తింటే అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా వీటిల్లో ఉప్పును ఎక్కువగా కలుపుతున్నారు. కాబట్టి వీటిని ఎంత దూరం పెడితే అంత మంచిది. దీని వలన అన్ని రకాల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఏదైనా సరే తక్కువ మోతాదులో ఇంట్లోనే చేసుకుని తింటే మంచిది. బయట హోటల్స్ లో మాల్స్ లో వీటిని వండేటప్పుడు చాలా నూనెను వాడుతూ ఉంటారు. ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే కాబట్టి మీరు ఏదైనా కూరగాయలు తినాలనుకున్నా లేదా వండాలనుకున్న ఇంట్లో చేసుకోవడం మంచిది. చాలాసార్లు సెలవుల్లో ఉన్నప్పుడు పదేపదే బయటకు వెళ్లి పదే పదే బయట తిండి తింటున్నారు చాలామంది. ఎప్పుడో ఒకసారి బయట తినడం అయితే పర్వాలేదు. కానీ మీరు పదే పదే బయటకు వెళ్లి అక్కడ వేయించినవి తింటూ ఉంటే మాత్రం అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

మీరు పన్నీరు కూర ఎక్కడో ఒక చోట తినే ఉంటారు కదా.. దీన్ని కూడా చాలా కొవ్వు పదార్థాలు వాడి తయారు చేస్తూ ఉంటారు. అది చాలా అనారోగ్యకరమైనది. నిజానికి ఈ రోజుల్లో మనం తినే జున్ను కూడా మంచిది కాదు. ఇక్కడ అన్నీ కూడా కల్తీవే దొరుకుతున్నాయి. ఎవరికి వారు కస్టమర్లను పెంచుకోవడానికి ఏవేవో రుచికరమైన షుగర్లు సాల్ట్ కలిపి చిత్ర విచిత్ర పదార్థాలను తయారు చేసేసి అమ్ముతున్నారు. అయితే ఇవి మీ ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తాయి. మీరు ఏ కూరగాయలైనా కూడా నేరుగా కొన్ని మీ ఇంట్లో వండుకుని తినడం ఎంతో ఉత్తమం. ఇలా చేయడం వలన ఎటువంటి ప్రమాదం లేదు. మీ ఆరోగ్యం కూడా ఎంతో పదిలంగా ఉంటుంది. ఈ కాలంలో చాలా మంది పురుగుల మందులను ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. అలా కాకుండా కొంతమంది ఆర్గానిక్ గా కూడా పండిస్తూ ఉంటారు. అలాంటివి చూసి అక్కడి నుంచి ఈ ఆర్గానిక్ గా పండించిన దగ్గర నుంచి కూరగాయలు కొని తెచ్చుకోవడం మంచిది. మనం తినే కూరగాయలు వాటితో చేసే వివిధ రకాల పదార్థాలు మన ఒంట్లో ఏ విధంగా బీపీ, షుగర్ పెంచుతాయి. అన్నది మీరు ఎంత ఎక్కువగా బయట తిండి తింటూ ఉంటారు. అంతే త్వరగా మీ ఆరోగ్యం కూడా పాడైపోయి గుండె జబ్బులు లేదా ఇతర ప్రమాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు రోజు వారి తినే కూరగాయలను జాగ్రత్తగా మీరే ఇంట్లో వండుకుని తినడం మంచిది. బయట తిండి అస్సలు ఒక్కసారి కూడా తినడం అనేది వ్యర్థం.. కోరి నష్టం తెచ్చుకోవడమే అవుతుంది..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది