Home » Devotional » 2024 Astrology For Libra
Devotional

Libra : 2024 తులా రాశి వారి రాశి ఫలాలు…ఉగాది తర్వాత జీవిత భాగస్వామి వలన….!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 10, 2024, 7:00 am
Advertisement

Libra : ఉగాది పండుగ సందర్భంగా తుల రాశి వారి రాశి ఫలాలు 2024లో ఏ విధంగా ఉన్నాయి…? వారి యొక్క జీవితం మరియు ఉద్యోగ దాంపత్య బంధం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తుల రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో ప్రత్యేకమైన ఫలితాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా లగ్న వ్యయాలలో కేతువు గ్రహ సంచారం ఉంది. అలాగే పంచమి స్థానంలో శని గ్రహ సంచారం ఉండడం వలన ప్రధానమైన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. దీంతో వీరికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఎక్కడికి వెళ్లినా కూడా వీరు గౌరవంగా ఆహ్వానించే ఫలితాలను కచ్చితంగా పొందుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలలో విశేషమైన ఫలితాలు లభిస్తాయి.అలాగే ఈ రాశి వారు కష్టపడి చేసిన పనులు కొంచెం అటు ఇటుగా ఫలిస్తాయి. అలాగే సాంకేతిక విద్యలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాలలో పేరును నిలబెట్టుకోగలుగుతారు.

Advertisement

Libra : కుటుంబంలో ప్రశాంత లోపించడం…

ఇక ఈ రాశి వారికి కుటుంబంలో ప్రశాంత లోపించే అవకాశాలు ఉన్నందున ముందస్తూ జాగ్రత్తలు తీసుకోడం మంచిది. అలాగే వృత్తి ఉద్యోగ విషయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది..

Libra : ప్రేమ పెళ్లిళ్ల విషయానికి వస్తే…

ఈ రాశి వారికి ప్రేమా పెళ్లిళ్లు ప్రధానాంశంగా మారుతాయి. భాగస్వామి కారణంగా మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఉగాది పండుగ తరువాత మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆదాయపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకుని వ్యవహరించాలి. అలాగే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న చివరికి సంతానం లభిస్తుంది. మీ బంధువులకు మీరు అండగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. అలాగే విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది వాటిని సక్రమంగా ఎదుర్కొంటారు.

Advertisement

Libra : 2024 తులా రాశి వారి రాశి ఫలాలు…ఉగాది తర్వాత జీవిత భాగస్వామి వలన….!

Libra : ఈ పరిహారాలు పాటించడం మంచిది…

ఈ రాశి వారు ఈ సమయంలో శుక్ర గ్రహానికి సంబంధించిన కొన్ని కీలకమైన పరిహారాలు ఉంటాయి వాటిని తప్పకుండా పాటించడం మంచిది. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో శ్రేష్ఠాన్ని కల్పిస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వారు బాస్మతి కంకణం ధరించడం శుభం కలిగిస్తుంది. తల్లిదండ్రులు సలహాలు లేనిదే ఏ పని చేయకుడదు. వ్యాపార రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి