Karkataka Rashi : కర్కాటక రాశి వారికి జూన్ నెల ఎలా ఉందంటే…ఈ పరిహారాలు పాటించడం తప్పనిసరి…!
ప్రధానాంశాలు:
Karkataka Rashi : కర్కాటక రాశి వారికి జూన్ నెల ఎలా ఉందంటే...ఈ పరిహారాలు పాటించడం తప్పనిసరి...!
Karkataka Rashi : కర్కాటక రాశి జూన్ 2024 పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం , నాలుగు పాదాలు ఆప్లేక్ష నక్షత్రం నాలుగు పాదాల జన్మించిన వారు కర్కాటక రాశి అవుతుంది .అయితే ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది. వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన సంఘటనలు ఏమిటి..?లాభనష్ట ఫలితాలు ఎలా ఉన్నాయి.ఎలాంటి పరహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది.అనే విషయాల గురించి ఇప్పుడు మనకు తెలుసుకుందాం..
కర్కాటక రాశి వారికి ఈ నెల మంచి ఫలితాలు రానున్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నా వారికి బాగుంటుంది.కానీ సహచరుల వల్ల కొన్ని ఇబ్బందులకి గురికావాల్సి ఉంటుంది.వృత్తి ఉద్యోగాలలో అద్భుతమైన ఫలితాలను రాణిస్తారు.అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. పట్టుదలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అలాగే విదేశాల నుంచి మంచి సమాచారం అందుతుంది. వ్యాపారంలో పెట్టుబడును పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. విద్యార్థులకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. జూన్ మొదటి రెండు వారాల్లో మీకు సాధారణంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైన సద్దుమనుగుతాయి.ఇక రాజకీయ వర్గాలకు చెందినవారికి ఒత్తిడిలు తొలగుతాయి.
మరియు కుటుంబ విషయాలలో మార్పులు ఉంటాయి. విద్యార్థుల ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది.ఈ మాసంలో అవివాహితులు పడమర దిక్కున ప్రయాణించడం వలన కలిసి వస్తుంది. స్త్రీలకు నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించే అవకాశం ఉంది.ఈ మాసం చివరలో శుభవార్తలను వింటారు. మనోధైర్యాన్ని తిరిగి పొందుతారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించి శుభవార్తలను వింటారు. ఆస్తిని అభివృద్ధి చేసే పనిలో విఫలం అవుతారు.అలాగే బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు జరుపుకుంటారు. ఇష్టదేవత ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద ఈ మాసం సౌకర్యవంతంగా ఉంటుంది.వ్యాపారస్తులు మాసం చివరన నిర్ణయాలు తీసుకోవడం మంచిది.శివారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.దీని వల్ల అశాంతి తొలుగుతుంది.
Karkataka Rashi అమావాస్య రోజు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే
కర్కాటక రాశి వారు పచ్చ కర్పూరాన్ని నీటిలో కలిపి స్నానం చేయాలి. సత్యనారాయణ కథను పట్టించి బ్రాహ్మణులకు పిండి, బెల్లం , దానం చేయడం మంచిని కలుగజేస్తుంది. ఇది ఇలా చేయడం ద్వారా ఉద్యోగం వ్యాపారులు పురోగతి వస్తుందని నమ్మకం. అనుకూల శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య అమ్మవారి పటానికి ఎర్ర పూల దండ వేసి పూజించడం మంచిది.