Sagittarius : జూన్ నెలలో ధనస్సు రాశి వారికి పట్టనున్న అదృష్టం… దేవుడు దిగివచ్చిన మీ అదృష్టాన్ని ఆపలేడు ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sagittarius : జూన్ నెలలో ధనస్సు రాశి వారికి పట్టనున్న అదృష్టం… దేవుడు దిగివచ్చిన మీ అదృష్టాన్ని ఆపలేడు !

Sagittarius : ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరంగా ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది. లాభం ధన కీర్తి విశేషమైన ఆకర్షణ కలుగుతుంది కానీ వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలు వీరందరికీ ఏదో ఒక రకమైన ఆశాభావం ఉంటుంది.ఒక అద్భుతమైన అవకాశం కూడా ఈ జూన్ మాసంలో ధనుస్సు రాశి వారికి వస్తుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ వీరికి ధైర్య సాహసాలు ఎంతో అవసరం అవుతాయి. కాబట్టి మీ కెరియర్ అభివృద్ధి […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 May 2024,8:00 am

Sagittarius : ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరంగా ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది. లాభం ధన కీర్తి విశేషమైన ఆకర్షణ కలుగుతుంది కానీ వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలు వీరందరికీ ఏదో ఒక రకమైన ఆశాభావం ఉంటుంది.ఒక అద్భుతమైన అవకాశం కూడా ఈ జూన్ మాసంలో ధనుస్సు రాశి వారికి వస్తుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ వీరికి ధైర్య సాహసాలు ఎంతో అవసరం అవుతాయి. కాబట్టి మీ కెరియర్ అభివృద్ధి చెందే పనులు అందరి ముందు ప్రశంసించగల పనులు వీరు చేసినట్లయితే తప్పనిసరిగా ధనుస్సు రాశి వారికి ఒక అవకాశం అయితే ఈ నెలలో వస్తుంది. బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు. అలా సాధిస్తే ఈ మాసంలో వీరు చాలా సంపాదించిన వారు అవుతారు. ఆర్థికపరంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.రాజకీయ రంగంలో ఉన్నటువంటిి వారికి మంచి పేరు పదవి ఉన్నప్పటికీ ఒక నిరుత్సాహకం అనేది ఉంటుంది. ప్రచారానికి ఉన్న జోరు ప్రమాణస్వీకారానికి ఉండదు.

కుటుంబ పరమైన లబ్ధి విషయాలకు వస్తే ఆహ్లాదకరమైన వాతావరణం ధనుస్సు రాశి జాతకులు ఈ మాసంలో పొందుతారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు.మంచి విషయాలను చర్చిస్తూ ఉంటారు. నలుగురితో మాట్లాడే సందర్భాలలో మీ మాటకి పదును ఏర్పడుతుంది. విద్యార్థులు విదేశాలకు వెళ్లే కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగాలు లేనటువంటి వారు కూడా ఈ నెల ఆఖరిలోపు సత్ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదో ఒక పని చేస్తూ సంపాదిస్తారు. అలాగే కుటుంబాన్ని నడిపే అటువంటి ముఖ్యమైన బాధ్యతను తీసుకుంటారు.తొందరపాటుతో ఏమరపాటుతో ఎవరికి పడితే వారికి మాట ఇవ్వొద్దు. ఉద్యోగాలు చేసేటువంటి వారు మరియు వ్యాపారాలు చేసేవారు వ్యవహారాలు చేసే స్త్రీలు సమాజంలో ఉన్న దుష్టశక్తుల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి.దానివల్ల మీకు ఎంతో ఉపయోగం కలుగుతుంది. ఆరోగ్యంగా జీవనం గడపడానికి ధనస్సు రాశి వారు శాకాహారాన్ని బుజించడం మంచిది.

ప్రాణాయామం చేయండి లేకపోతే అనారోగ్యానికి గురవుతారు. అలాగే నెలాఖరిలో అనారోగ్యం వలన ఒక చిన్న బాధ ఏర్పడుతుంది ఆ బాధను తట్టుకోలేరు.కాబట్టి మంచి ఆహారాన్ని తినండి. అలాగే ఎవరైతే మన వంశోద్ధారకులు కాలం చేసి ఉంటారో అటువంటి వారికి సంస్కారాలు మంచిగా జరగపోయినట్లయితే సంతాన వృద్ధి ఉండదు. కాబట్టి ఆడవారే తగిన జాగ్రత్తలు తీసుకుని సంతానపరమైన ప్రయత్నాలు చేయాలి. అతని పేరు మీద స్వయంపాకము పితృకర్మ వంటివి చేయాలి. లేకపోతే శాపం ఉంటుంది. తద్వారా ఎంత సంపాదించిన నిర్వాహంగా ఉంటుంది. ఏదో ఒక రోగం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి జాతకులు ఎవరైతే వారి కుటుంబంలో కాలం చేసిన వారు ఉన్నట్లయితే వచ్చేటటువంటి ఈ పరిహారాలను పాటించండి.

Sagittarius జూన్ నెలలో ధనస్సు రాశి వారికి పట్టనున్న అదృష్టం దేవుడు దిగివచ్చిన మీ అదృష్టాన్ని ఆపలేడు

Sagittarius : జూన్ నెలలో ధనస్సు రాశి వారికి పట్టనున్న అదృష్టం… దేవుడు దిగివచ్చిన మీ అదృష్టాన్ని ఆపలేడు !

Sagittarius పరిహారాలు

జేష్ఠ అమావాస్య రోజున తప్పనిసరిగా స్వయంపాకాన్ని బ్రాహ్మణునికి దానం చేయండి. గోవులకి పెద్దల పేరుతో గ్రాసాన్ని సమర్పణ చేయండి.ఈ విధంగా చేయడం ద్వారా ధనస్సు రాశి జాతకులు జూన్ నెలలో దివ్యమైన అనుగ్రహాన్ని పొందగలుగుతారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది