Zodiac Signs : ఉగాది పంచాంగం 2022- 23ప్రకారం వృషభ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Zodiac Signs : తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం వృషభ రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 8, వ్యయం 8గా ఉన్నాయి. అలాగే రాజపూజ్యం 6, అవమానం 6గా ఉన్నాయి. అంటే గౌరవించే వారి సంఖ్య అవమానించే వారు కూడా సమానంగా ఉన్నారు. అలాగే మీరు మొదలు పెట్టిన పనుల్లో మీకు అంతా విజయమే కల్గుతుంది.
అదే విధంగా ప్రధాన గ్రహాలైన గురు, శని, రాహు, కేతు గ్రహాల సంచారం వల్ల వృషభ రాశి మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులంతా మీపై ఆదరాభిమానాలను కల్గి ఉంటారు.ఈ కొత్త సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానం కోసం చాలా రోజులుగా బాధపడే వారికి మంచి శుభవార్త అందే సూచనలున్నాయి. కళా రంగంలో ఉన్న వారికి చక్కటి అవకాశాలు వస్తాయి.

horoscope 2022 telugu year and check your zodiac signs taurus
రాజకీయ నాయకులు, మెడికల్ రంగం వాళ్లకి పేరు ప్రతిష్టలతో పాటు అనుకోని విజయాలు వరిస్తాయి. అయితే కొత్తగా వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టాలనుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇలాంటివి చేయడం వల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి
