Zodiac Signs : మేష రాశి వారికి ఆగస్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 22, 2022, 4:00 pm

Zodiac Signs : ఆగస్టు నెల, 2022, మేష రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. ఇలా 11వ తారీఖు వరకు కలిసి ఉండి, ఆ తర్వాత కుజుడు వృషభంలోనికి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు 7 వ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహంలోకి వస్తున్నారు. అలాగే సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఈ యొక్క బుధుడు 21వ తారీకు వరకు సింహరాశిలో ఉండి, ఆ తర్వాత కన్యారాశిలోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు. అయితే ఈ గ్రహ స్థితిని అనుసరించి ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మాసంలో మేషరాశిలో రాహువు ఉన్నాడు కనుక చేసే పనిలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. కొన్ని సీరియస్ విషయాలను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా గతంలో కంటే ఇప్పుడు బలంగా ఉంటారు. 11 వ తారీఖు తరువాత సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ధనం విషయంలో చక్కగా ఉంది. కుటుంబ సహకారంతో కొన్ని రంగాల్లో ధనాన్ని సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్స్, రైతులకు ధనయోగం కలగనుంది. వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. 7 వ తారీఖు తర్వాత నుంచి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, కోసం ప్రయత్నించే లోన్స్ ఫలిస్తాయి.

horoscope August 2022 check your zodiac signs Aries

horoscope August 2022 check your zodiac signs Aries

ఈ యొక్క మేషరాశి వారికి రాజకీయ విషయంలో, సంతాన విషయంలో 11వ తారీకు నుంచి చక్కగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా టీచర్, లా కు సంబంధించిన వాటిల్లో చక్కని అవకాశాలు రానున్నాయి. వ్యాపార విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మేష రాశి వారికి ఆగస్టు నెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే సూర్యభగవానుడిని ఆరాధించాలి. కుమారస్వామి స్తోత్రాలను చదవాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp