Zodiac Signs : మిథున రాశి వారికి, ఆగష్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : మిథున రాశి వారికి, ఆగష్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Zodiac Signs : ఆగష్టు నెల, 2022, మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో ఈ రాశిలో కుజుడు, రాహువు కలిసి ఉన్నారు. ఇలా పదకొండవ తారీకు వరకు కలిసి ఉండి కుజుడు 11వ తారీకు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహరాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 July 2022,4:00 pm

Zodiac Signs : ఆగష్టు నెల, 2022, మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో ఈ రాశిలో కుజుడు, రాహువు కలిసి ఉన్నారు. ఇలా పదకొండవ తారీకు వరకు కలిసి ఉండి కుజుడు 11వ తారీకు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహరాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఈ యొక్క బుధుడు 21 వ తారీకు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యారాశిలోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు. అయితే ఈ గ్రహ స్థితిని అనుసరించి ఈ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మాసంలో మిథున రాశి వారికి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే 21వ తారీకు తరువాత ఆస్తులను అమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త ఆస్తులను కొనగలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు చక్కని భవిష్యత్తు ఉంది. రైతులకు పంట విషయంలో చక్కగా ఉంది. ఫైనాన్స్ విషయంలో అనుకూలంగా ఉంది. ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న రుణాల లోన్స్ ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని మనస్పర్ధలు రానున్నాయి. ఇలాంటి వారు రోజు సూర్య భగవానుడిని పూజించాలి. గర్భవతులు, సినిమా రంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది.

horoscope august 2022 check your zodiac signs Gemini

horoscope august 2022 check your zodiac signs Gemini

రుణ సంబంధిత విషయాల్లో చక్కగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తులు లభించే అవకాశం రానుంది. లా రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ వారు వేరే ప్రాంతాలకు బదిలీ అవుతారు. కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటారు. భూముల విషయంలో జాగ్రత్త వహించాలి. మిధున రాశి వారికి ఈనెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే నిత్యం నిద్రలేవగానే గణపతిని ధ్యానించాలి. అలాగే గణపతి స్తోత్రాలను చదవాలి. నవగ్రహాలలో కేతువు గ్రహానికి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది