Home » Devotional » Horoscope August 2022 Check Your Zodiac Signs Taurus
Devotional

Zodiac Signs : వృషభ రాశి వారికి ఆగస్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 23, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : ఆగస్టు నెల, 2022, వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. ఇలా పదకొండవ తారీకు వరకు ఉండి, ఆ కుజుడు 11 వ తారీకు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి వస్తున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహ రాశిలోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఈ యొక్క బుధుడు 21వ తారీకు వరకు సింహరాశిలో ఉండి ఆ తరువాత కన్యారాశిలోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీన రాశిలో గురుడు ఉన్నారు. అయితే ఈ గ్రహ స్థితిని అనుసరించి ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎక్స్పెండిచర్ విషయంలో చక్కగా ఉంది. పార్ట్నర్ విషయంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వామి పేరుమీద కొన్ని ఆస్తులను కొనుక్కుంటారు. అలాగే ధన సంబంధిత విషయాల్లో 21వ తారీకు తర్వాత చక్కగా ఉంది. ఋణ సంబంధిత విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఏడవ తారీఖు నుంచి కొన్ని శుభవార్తలను వింటారు. సంతాన సంబంధిత విషయాల్లో చక్కగా ఉంది. సినిమా రంగంలో వారికి కొత్త అవకాశాలు రానున్నాయి. విద్యార్థులకు స్కాలర్షిప్ కు సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంది. రైతులకు గవర్నమెంట్ ద్వారా కొన్ని సబ్సిడీలు వస్తాయి.

horoscope august 2022 check your zodiac signs Taurus

Advertisement

గృహ సంబంధిత విషయాల్లో చక్కగా ఉంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. గ్రహబలం వలన కొన్ని పనులు జరుగుతాయి. రియల్ ఎస్టేట్స్ వారికి ధనయోగం కలగనుంది. పార్ట్నర్స్ తో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే వృషభరాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే విష్ణు సహస్రనామాలను నిత్యం పారాయణం చేయాలి. సూర్య భగవానుడిని చూసి విష్ణు సహస్రనామాలను చేస్తే మంచిది. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి