Zodiac Signs : మిథున రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Zodiac Signs : జూలై మాసం, 2022, మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు, కలిసి ఉన్నారు. అలాగే వృషభ రాశిలో బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నారు. ఆ బుధుడు రెండవ తేదీ నుంచి వృషభం నుంచి మిథునంలోకి చేరుకుంటాడు. మిథునంలో 17వ తేదీ వరకు ఉండి ఆ తర్వాత రోజు నుండి బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు. ఇక తులా రాశిలో కేతువు, మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోకి వస్తున్నాడు. అదేవిధంగా మీనరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది, అలాగే మిథున రాశి లోని నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి వారికి రవి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే 12వ స్థానంలో ఉన్న బుధుడు మిధున రాశిలోకి వస్తున్నాడు. ఇలా ఉండడం వలన మిథున రాశి వారికి ఎప్పటి నుంచో అనుకుంటున్న కొన్ని పనులు ఈ మాసంలో జరుగుతాయి. అలాగే విద్యార్థులకు చదువు విషయంలో అనుకూలంగా ఉంటుంది. అప్పులు చేసే విషయం లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిథున రాశిలో గల మూడు నక్షత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం వారు ముఖ్యంగా అప్పులు విషయంలో జాగ్రత్త వహించాలి. ఆన్లైన్ బిజినెస్ లు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. కొన్ని అనుకున్న పనులు జరుగుతాయి. ఆరుద్ర నక్షత్రం వారికి ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్లలో కొద్దిగా లాభాలు, కొద్దిగా నష్టాలు వస్తాయి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. అలాగే పునర్వసు నక్షత్రం వారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా రానున్నాయి.
అందులో ముఖ్యంగా బ్యాంకింగ్, టీచింగ్, గైడింగ్ చేసే వారికి చక్కని అవకాశాలు వస్తాయి. అలాగే మిథున రాశి వారు విదేశాలకు వెళ్లి విద్యను కొనసాగిస్తారు. ధన సంబంధిత విషయాల్లో ఎటువంటి లోటు ఉండదు. కుటుంబం తరపున కాస్త ఒత్తిడి పెరుగుతుంది. గృహ నిర్మాణాలు జరుగుతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఈ నెల యందు జాగ్రత్త వహించాలి. వివాహం కుదరని వారికి ఈ మాసంలో వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే మిధున రాశి వారికి ఈ నెల యందు అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతరాదన ఏంటంటే ప్రతిరోజు వినాయకుడికి పూజలు చేయాలి. గోవులకు గ్రాసం తినిపించండి. లక్ష్మీదేవిని తామర పువ్వులతో ఆరాధన చేయండి. ఇలా చేయడం వలన మిథున రాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.