Zodiac Signs : మేష రాశి వారికి జూన్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయోంటే..?

Authored By pavan J | The Telugu News | Updated on: June 10, 2022, 4:00 pm

Zodiac Signs : జూన్ నెల 2022లో మేష రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మేష రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీకు ఈ మాసంలో విదేశీ ధన యోగం పుష్కలంగా ఉంది. ప్రభుత్వ సంబంధించిన పనులు, పూర్వీకులకు సంబంధించిన ఆస్తి విషయాల్లో పనులు సఫలం అవుతాయి. అంతే కాకుండా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ మాసం చాలా మంచిది. పై అధికారుల నుంచి ప్రశంసలు, ప్రమోషన్లు, అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం కనిపిస్తోంది.

అలాగే రైతులకు, రియల్ ఎస్టేట్ రంగాలు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు చాలా చక్కటి ఫలితాలు కనిపించబోతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, వేరే ఇతరుల నుంచి రావాల్సిన బకాయి డబ్బులు ఈ నెలలో కచ్చితంగా వసూలు అవుతాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నించే వారు కచ్చితంగా ఈ మాసంలో శుభవార్త వినబోతున్నారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్లు పెట్టుబడులు పెట్టే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని సరి చూసుకున్నాకే పనిని ఆరంభించండి. అప్పుడే మీరు అనేక లాభాలను పొందగల్గుతారు.

horoscope june 2022 check your zodiac signs Aries

horoscope june 2022 check your zodiac signs Aries

పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సంబంధం కుదుర్చుకునేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నాకే ముందుకు సాగాలి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మాట్లాడే ముందు నోరు జారకుండా మాట్లాడండి. వాహనాలు నడిపేటప్పుడు, విద్యుత్తుకు సంబంధించిన పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాద సూచనలు ఉన్నాయి. జాగ్రత్త తప్పనిసరి. నవ గ్రహాల పూజలు చేస్తూ.. వేంకటేశ్వర స్వామికి పూజ చేయడం చాలా మంచిది.

pavan J

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp