Zodiac Signs : మిథున రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By pavan J | The Telugu News | Published on: June 12, 2022, 4:00 pm

Zodiac Signs : జూన్ నెల 2022లో మిథున రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేస్, వాహన, న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి ధనయోగం అధికంగా కనిపిస్తోంది. అనాగే సైంటిస్ట్ లు కొత్త కొత్త వస్తువులు కనిపెట్టబోతున్నారు. విదేశీ యానం చేయాలనుకునే వారు ఈ నెలలో ప్రయత్నాలు చేస్తే సఫలం అవుతాయి.

అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలలో కచ్చితంగా రుణం పొందుతారు.పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల 28వ తేదీ లోపు.. చుట్టరికం ఉన్న వారితోనే పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగాలకు సంబంధించి శుభవార్త వింటారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అంతే కాకుండా అవార్డులు, రివార్డులతో పాటు ప్రమోషన్లను కూడా అందుకోబోతున్నారు. పెట్టుబడులు పెట్టే వారు జాగ్రత్తగా పెడ్తే… చాలా లాభాలను పొందుతారు.

horoscope june 2022 check your zodiac signs gemini

horoscope june 2022 check your zodiac signs gemini

కాబట్టి పెట్టబడులు పెట్టే ముందు కాస్త ముందూ వెనకా ఆలోచించి నిర్ణయాలు తీస్కోవాలి. అలాగే సినిమా రంగానికి సంబంధించిన వాళ్లు, క్రియేటివ్ రంగానికి సంబంధించిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అయితే సోదర సోదరీమణులతో కొన్ని గొడవలు.. వారి కోసం డబ్బు ఖర్చు చేయడం వంటివి జరగబోతున్నాయి. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అలాగే వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటన్నిటి నుంచి తప్పించుకోని హాయిగా ఉండాలంటే గణపతి, వేంకటేశ్వర స్వామి ఆరాధన చాలా మంచిది.

pavan J

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp