Zodiac Signs : కర్కాటక రాశి వారికి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By pavan J | The Telugu News | Published on: March 17, 2022, 4:00 pm

Zodiac Signs : మార్చి నెల 2022 సంవత్సరంలో కర్కాటక రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్లకు సప్తమంలో అంటే మకరంలో పంచగ్రహ కూటమి ఉంది. అదే విధంగా ఐదవ ఇంట కేతువు సంచారం జరుగుతోంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్లకి పంచగ్రహ కూటమి వల్ల, కేతువు వల్ల కొన్ని మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా చెడు ఫలితాలు కూడా కొన్ని ఉన్నాయి.అయితే ప్రధానంగా కర్కాటక రాశి వాళ్లకి ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది.

అయితే ఈ మాసంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్లకు సత్ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు చక్కటి లాభాలు  వస్తాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. మీరు ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నెలలో మాత్రం శ్రమ ఎక్కువగా పెరుగుతుంది. పై అధికారుల మెచ్చుకోలుతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి వ్యాపారం చేసే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీవిత భాగస్వామితో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అయితే ఎవ్వరికీ అప్పులు ఇవ్వడం కానీ తీస్కోవడం కానీ చేయకపోవడం మంచిది.

horoscope march 2022 check your zodiac signs cancer

horoscope march 2022 check your zodiac signs cancer

విదేశాలకు వెళ్లాలనుకునేవాళ్ల చాలా జాగ్రత్తగా ఉండి… నిపుణులు సలహాలు పాటించడం మంచిది. ఆరోగ్య పరంగా… ఆహార నియమాలు పాటించాలి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

pavan J

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp