Zodiac Signs : వృశ్చిక రాశి వారికి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By pavan J | The Telugu News | Published on: March 21, 2022, 4:00 pm

Zodiac Signs : మార్చి నెల 2022 సంవత్సరంలో వృశ్చిక రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మూడవ స్థానంలో పంచగ్రహ కూటమి సంచరిస్తోంది. ఆ తర్వాత కొన్ని గ్రహాలు పక్కకు పోవడం, ఆ తర్వాత మూడు గ్రహాలు మకరంలోకి రావడం అనేది సంభవిస్తోంది. అయితే నాలుగవ ఇంట్లో గురువు రవితో కలిసి ఉండటం ప్రధానంగా చెప్పుకునే అంశం. అలాగే సప్తమ స్థానంలో రాహు సంచారం కూడా వృశ్చిక రాశి వారికి జరుగుతుంది.

శని, రాహు, కేతు, గురు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ మాసం అంతా వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు ఉన్నాయి.దాదాపుగా 80 నుంచి 90 శాతం శుభ వార్తలు వినబోతున్నారు. మీకు గ్రహాల అనుకూలత ఉన్నప్పటికీ.. బాగా శ్రమించి పని చేయాలి. ఎంత కష్టపడితే అంత ఫలితం కల్గుతుంది. అదే విధంగా ఈ రాశి వాళ్లకు ఈ నెలలో ఆథ్యాత్మి చింతన బాగా పెరుగుతుంది.

horoscope march 2022 check your zodiac signs scorpio

horoscope march 2022 check your zodiac signs scorpio

ఆర్థికంగా ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మాసంలో కచ్చితంగా పెళ్లి నిశ్చయం అవుతుంది. విద్యార్థులకు కూడా ఈ మాసం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

pavan J

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp