Zodiac Signs : తులా రాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయోంటే..?

Authored By pavan J | The Telugu News | Published on: May 19, 2022, 4:00 pm

Zodiac Signs : మే నెల 2022లో తులా రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే తులా రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు గ్రహం ఆరవ స్థానంలో ఉండటం, శని గ్రహం ఐదవ స్థానంలో ఉండటం అదే విధంగా కేతువు తులా రాశిలో సంచరించడం, కుజుడు మేషరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాల సంచారం వల్ల చాలా లాబాలు కల్గబోతున్నాయి.ముఖ్యంగా ఆర్థిక విషయాల విషయానికొస్తే…

చాలా కాలంగా ఉన్న అప్పులను ఈ నెలలో తీర్చేస్తారు. అంతే కాకుండా రుణాల కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ నెలలో కచ్చితంగా లోన్ లను పొందుతారు. అలాగే కోర్టు వ్యవహారాల కేసుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు చక్కటి కాలం. కానీ మనసును చదువు మీద లఘ్నం చేస్తేనే విజయం సాధించగల్గుతారు.ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారు కచ్చితంగా ఈ మాసంలో ఉద్యోగాన్ని పొందుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ నెలలో కచ్చితంగా మంచి సంబంధం కుదురుతుంది.

horoscope may 2022 check your zodiac signs libra

horoscope may 2022 check your zodiac signs libra

అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యత, ప్రేమానురాగాలు బలపడతాయి. ఆస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా జాగ్రత్త అవసరం. ఏ చిన్న తప్పు జరిగినా మీ ప్రేమను కోల్పోవడం ఖాయం. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

pavan J

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp