Rasi Phalalu : 2024లో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఇవే… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rasi Phalalu  : 2024లో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఇవే…

Rasi Phalalu : 2024  నాలుగో సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఏమిటో మనం తెలుసుకుందాం.. 2024వ సంవత్సరంలో ద్వాదశి రాశిలలో ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టపోతుంది. ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు. దాదాపుగా 80% జాతక దోషాలను పోగొట్టే శక్తి గురు గ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. 2024వ సంవత్సరం మే నెల ఒకటో తేదీ గురువు […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  Rasi Phalalu  : 2024 లో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఇవే...

  •  2024  నాలుగో సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఏమిటో మనం తెలుసుకుందాం.. 2024వ సంవత్సరంలో ద్వాదశి రాశిలలో ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టపోతుంది.

  •  2004 లో అఖండ రాజ‌యోగం ప‌ట్ట‌బోయేది ఈ రాశుల‌వారికే ...

Rasi Phalalu : 2024  నాలుగో సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఏమిటో మనం తెలుసుకుందాం.. 2024వ సంవత్సరంలో ద్వాదశి రాశిలలో ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టపోతుంది. ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు. దాదాపుగా 80% జాతక దోషాలను పోగొట్టే శక్తి గురు గ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. 2024వ సంవత్సరం మే నెల ఒకటో తేదీ గురువు మేషరాశిలో నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గురువు సంచారంలో మార్పు వల్ల 2024 ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది.

మేషరాశి :

మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏంటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభరాశి రెండో రాశి అవుతుంది. అంటే మేష రాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది. ద్వితీయమంటే కుటుంబ స్థానం కాబట్టి మేష రాశి వాళ్ళకి 2024లో కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ధనపరంగా బాగా కలిసొస్తుంది. ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది. మీ మాటకు విలువ గౌరవము పెరుగుతాయి. కాబట్టి వాక్కు పరంగా ధనం పరంగా కుటుంబ జీవితం పరంగా మేష రాశి వారికి 2024లో గురువు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది.

మకర రాశి:
మకర రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదో రాసి అవుతుంది. అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు. మకర రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. సంతానం లేని మకర రాశి వారికి 2024లో కచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ట లభిస్తే మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్ళటానికి 2024 సంవత్సరంల మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాసి మకర రాశి.

వృశ్చిక రాశి:

ఈ వృశ్చిక రాశివారికి ఈ గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి గురువు ఏడో సంచారం చేస్తున్నాడు. ఈ సప్తమ సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి 2024లో కచ్చితంగా పెళ్లిళ్లు అవుతాయి. చాలాకాలంగా పెళ్లిళ్లవక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి 2024లో కచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లిళ్లు అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు ఈ 2024లో కచ్చితంగా కలుస్తారు. సమస్యలు అన్ని తొలగిపోయే వృశ్చిక రాశి వారికి 2024లో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది.

కన్యా రాశి:
కన్యా రాశి వాళ్ళకి గురువు ఈ 2024 లో మే నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు. అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు. పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యా రాశి వాళ్ల మీద పడుతుంది. కన్యా రాశి వాళ్లు పట్టిందల్లా బంగారాల్లా ఉంటుంది. ఆర్థికంగా కన్యారాశి వాళ్లకు తిరుగు ఉండదు. విపరీతంగా ధన లాభం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువులు తొలగిపోతారు.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఈ 2024 లో మే నుంచి లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి స్థానం 11వ స్థానం. కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ 2024లో తిరుగు ఉండదు. ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు. డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు ఏ రంగంలో ఉన్న మీరే నెంబర్ వన్ గా చక్రాలు తిప్పుతారు. ఆకస్మిక ధనప్రాప్తియోగం కూడా కలుగుతుంది. అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్ళు 2024లో గురు బలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింప చేసుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు…

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక