Kumbha Rasi Phalalu : 10 ఏళ్ల‌ త‌ర్వాత న‌వంబ‌ర్ నెల‌లో కుంభ‌రాశి వారి ఇంత‌టి అదృష్టం.. కానీ ఓ ఘోరం జ‌రుగ‌బోతుంది..!

Authored By aruna | The Telugu News | Published on: November 1, 2023, 7:00 am

Kumbha Rasi Phalalu  : నవంబర్ నెలలో కుంభరాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో నవంబర్ నెలలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ప్రతికూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో మనం తెలుసుకుందాం. కుంభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెలలో గ్రహాల సంచారం మొత్తం అనుకూలంగా ఉంది. అందువల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో ఉంటే ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన పురోభివృద్ధి కనిపిస్తుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వ్యాపార రంగంలో ఉంటే మీరు ఊహించిన దాని కంటే రెట్టింపు లాభాలు వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారం మూడు పువ్వుల కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ ఉంటుంది. కావలసిన స్కూళ్లల్లో కావలసిన కాలేజీలో ర్యాంకులు నవంబర్ నెలలో కనిపిస్తోంది.

అలాగే వ్యవహారాలన్నీ పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది. అనేకమార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు నవంబర్ నెలలో కుంభరాశి వాళ్లకు అనుకూలిస్తాయి. ఆరోగ్య సహకారం ఆరోగ్య లాభం ఉంటుంది. అంటే అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదర సోదరీమణుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్లతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తే ఉంటుంది. వాళ్ల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది. అలాగే వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుక్కునే యోగం కూడా ఉంది. ఉద్యోగులు అయితే ఇల్లు గాని ప్లాట్లు గాని కొనుక్కునే యోగం కూడా ఉంది.

భార్యాభర్తల మధ్య పూర్తి అవగాహన ఉంటుంది. జీవన సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతూనే ఉంటుంది. ఈ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలు నాలుగు, ఆరు, పద్నాలుగు 16, 17, 21 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఈ నెల మీకు కలిసిరాని తేదీలు 11, 19 ,23 ,27 ,29 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. అలాగే కుంభ రాశి వాళ్ళకి ఈ నెలలో వీలైనప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కానీ శివాలయాన్ని కానీ వెళుతూ ఉండండి. ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి.

aruna

No bio available for this author.

  1. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

  2. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

  3. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

  4. "Charlotte Telugu Sambaralu 2026 : షార్లెట్‌లో తెలుగు సంబరాలు 2026 ఘనంగా.. మిషిగన్‌లో నాట్స్ కొత్త చాప్టర్ ప్రారంభం"

  5. "NATS : అమెరికా తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం.. సాయి గంగులకు కీలక బాధ్యతలు"

  6. "Flipkart Big Billion Days : రూ.9 వేలలోపు ఫోన్లు.. 5Gపై అదిరే డీల్స్"

  7. "Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌కు అగ్నిపరీక్ష.. ఆ రెండు సినిమాలే ఆమె భవితవ్యాన్ని తేలుస్తాయా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp