
today horoscope in telugu
మేష రాశి ఫలాలు : ఈరోజు ఇంట్లో పెద్దల ఆరోగ్యం జాగ్రత్త. దీనివల్ల వైవాహిక జీవితం పై ప్రభావం పడుతుంది. ఆందోళన ఉంటుంది. పొదుపు చేయడం వల్ల భవిష్యత్కు మంచి జరుగుతుంది. శ్రమతో కూడుకున్న రోజు. అయితే అనుభవంతో తేలికగా పనులను పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వైవాహికంగా అద్భుతమైన రోజు. కార్తీక సోమవారం శివారాధన చేయండి మంచి ఫలితం వస్తుంది. వృషభ రాశి ఫలాలు : ఈరోజు టెన్షన్‌ను వదిలించుకోండి. గతంలో దాచుకున్న ధనంతో అవసరాలు తీరుతాయి. మీకు సంబంధించిన రహస్యాలను ఈరోజు ఎవరితో పంచుకోవద్దు. ప్రేమ బంధం మరింతగా పెరిగి వివాహం వైపు దారి తీయవచ్చు. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. గణపతి ఆరాధన చేయడం ద్వారా ఆర్ధిక జీవితం బాగా ఉంటుంది.
మిథున రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ప్రేమ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు లేదా చాట్ చేస్తారు. కొత్త బంధుత్వాలు పెరుగుతాయి. లీగల్ విషయాలలో జాగ్రత్త. జీవిత భాగస్వామితో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కానీ వాటిని మీరు అధిగమిస్తారు. ఆర్థికంగా బాగుండటానికి శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు వివాదాల వల్ల మీ మనసు ఆందోళనగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు కొత్త పథకాలలో పెట్టుబడులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి వాటిలో చేరండి. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. మీ లవర్ అంతుపట్టని మూడ్ లో ఉంటారు. దాంపత్య జీవితంలో చికాకులు వస్తాయి. శ్రీశివుడికి రుద్రాభిషేకం చేయండి.
today horoscope in telugu
సింహ రాశి ఫలాలు : ఈరోజు సానుకూల దృక్పథంతో ముందుకుపోండి. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్లిలల భవిష్యత్ కోసం ప్లాన్ చేస్తారు. ఈరోజు మీ విలువైన కానుకలు లేదా బహుమతులు వంటివి ఏవీ పనిచేయక ప్రేమికులు ఇబ్బంది పడుతారు. వృత్తిపరమైన విషయాలు తేలికగా పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామి రహస్య విషయాలు మీ మనసును కలతకు గురిచేస్తాయి. సంకటహర గణపతి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు వత్తిడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటికి సంబంధించి విలువైన వస్తువుల కొనుగోలుకు ప్రయత్నం చేస్తారు.క్రొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఈరోజు బద్ధకంగా వ్యవహరిస్తారు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అవసరాలు తీరుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు ఫుల్ ఎనర్జీతో ఉంటారు. పనులను వేగంగా పూర్తిచేస్తారు. సంతానం వల్ల ఆర్థిక్ ప్రయోజనాలు పొందుతారు. సంతానాన్ని చూసి గర్వపడుతారు. ఇంట్లో మరింత ప్రశాంతత కనిపిస్తుంది. మీ జీవితంలో అభివృద్ధి కానవస్తుంది. వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది.కార్తీక మాస ఉపవాసం,శివాలయంలో దీపారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు చిరునవ్వులతో గడిచిపోతుంది. ఉమ్మడి వ్యాపారాలకు దూరంగా ఉండండి. పెట్టుబడులు పెట్టేటపుడు ఆలోచించి పెట్టండి.స్నేహితులతోను, బంధువులతోను హాయిగా సంతోషంగా గడుపుతారు. ప్రేమ సంగీతాన్ని ఎంజాయ్ చేసే రోజు. ఆఫీస్‌లో ఈరోజు వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మీ వైవాహిక జీవితం ఈ రోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీపరం కానున్నది. తుమ్మిపూలతో శివారాధన చేయండి లేదా శివకవచం పారాయణం చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. రుణాల నుంచి విముక్తి పొందుతారు. సంతానం వల్ల ఆనందంగా ఈరోజు గడిచిపోతుంది. ప్రేమలో పడ్డవారు ఈరోజు అదృష్టవంతులు. ఆర్థికంగా స్నేహితుల సపోర్ట్ లభిస్తుంది. వైవాహిక జీవితం ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది. లక్ష్మీ, శివారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
మకర రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి., విశ్రాంతి తప్పనిసరిగా అవసరం అయ్యే రోజు. చాలాకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రేమికులకు సంతోషం నిండిన ఒక మంచిరోజు. వ్యాపారులకు, ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. శివాలయంలో దీపారాధన చేయండి మంచి జరుగుతుంది,
కుంభ రాశి ఫలాలు : గత కొంతకాలంగా అనుభవిస్తున్న టెన్షన్లు దూరం అవుతాయి. ఆర్థిక పరిస్థితులు మామూలుగా ఉంటాయి. ఎవరికి ఈరోజు అప్పులు ఇవ్వకండి. విద్యార్థులు, నిరుద్యోగులు ఈరోజు సీనియర్ల సలహాలతో ముందుకుపోతే తప్పక మంచి జరుగుతుంది. బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త అందుతుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు పెట్టుబడుల విషయంలో తప్పనిసరిగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టండి. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబంలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా సాఫీపగా సాగిపోతుంది. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి. వైవాహిక జీవితం మధురంగా గడుస్తుంది. శ్రీశివాభిషేకం, అష్టోతర పూజ మంచి ఫలితాలను ఇస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.