Zodiac Signs : ఏప్రిల్ 03 ఆదివారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలతో ఈరోజు గడుస్తుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. అనుకోని ఇబ్బందులు రావచ్చు. ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. బంధువులతో విబేధాలు. మహిలలకు చికాకులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : అన్నింటా సానుకూల ఫలితాలు. ఆకస్మిక ప్రయాణ సూచన. అన్నదమ్ముల నుంచి మంచి వార్తలు వింటారు. ధన లాభాలు. మహిళలకు లాభ సూచన. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.
మిథునరాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. అప్పులు తీరుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకోని లాభాలు వస్తాయి. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ దుర్గా సూక్తం పారాయణ చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోని బాధలు. అనారోగ్య సూచన. కుటుంబంలో మార్పులకు అవకాశం ఉంది. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope april 03 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : మీకు పెద్దల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. అనుకోని చోట నుంచి ఆదాయం వస్తుంది. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. విందులు, వినోదాలు. మహిళలకు సంతోషకరమైన రోజు. శ్రీ శివారాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. కానీ వాటిని ధైర్యంగా అధిగమిస్తారు. అనుకోని కర్చులు పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణ చేయండి.
తులారాశి ఫలాలు : అనుకోన్న సమయానికంటే ముందే పనులు పూర్తిచేస్తారు. అన్నింటా విజయం సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాల వారికి మంచిరోజు. శ్రీలలితాదేవి ఆ రాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు. వృథా ప్రయాసలతో చికాకులు. మనస్సు శాంతి కరవుతుంది. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. అప్పులను తీరుస్తారు. ధన లాభాలు. మిత్రలతో కలసి విందులు, విహారాలకు వెళ్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవతరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : మీకు చాలా కాలంగా ఉన్న సమస్యలు తీరుతాయి. కుటుంబంలో సంతోషకరమైన పరిస్తితి. అప్తుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగంవిద్యా, ఉద్యోగాలలో కొత్త ఉత్సాహం. అమ్మవారి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : మీకు అనుకోని చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. మహిళలకు పని భారం పెరుగుతుంది. శివ కవచం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో శుభకార్య యోచన. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. విద్య, ఉద్యోగ విషయాలు సానుకూలం. మహిళలకు వస్త్రలాభం. శ్రీ దుర్గా దేవి ఆరాధన చేయండి.