YS Jagan : మళ్ళీ దొరికిపోయిన జగన్ .. ఆడుకుంటున్న టీడీపీ

 Authored By siddhu | The Telugu News | Updated on :20 February 2026,7:02 pm

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘నెయ్యి’ రాజకీయం ముదిరి పాకాన పడింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పాపం తనది కాదని, దీనికి బాధ్యులు చంద్రబాబు నాయుడేనని నిరూపించడానికి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పడుతున్న పాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ‘హెరిటేజ్ – ఇండాపూర్ డైరీ’ లింకును బయటపెట్టే క్రమంలో జగన్ మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

YS Jagan : మళ్ళీ దొరికిపోయిన జగన్ .. ఆడుకుంటున్న టీడీపీ

YS Jagan : మళ్ళీ దొరికిపోయిన జగన్ .. ఆడుకుంటున్న టీడీపీ

జగన్ తన ప్రెస్ మీట్‌లో ఇండాపూర్ డైరీకి, హెరిటేజ్ కంపెనీకి ఏదో అక్రమ సంబంధం ఉందని, ఆ నెయ్యి కల్తీకి కారణం ఇదేనని ఒక స్క్రీన్ షాట్ చూపించి నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన చూపించిన సాక్ష్యం ఎక్కడిదో తెలుసా? ‘ఇండియా మార్ట్’ అనే వెబ్ సైట్ లోనిది. ఇండియా మార్ట్ అనేది ఎవరైనా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి పేజీలు క్రియేట్ చేసుకునే ఒక ఓపెన్ ప్లాట్‌ఫామ్. అందులో ఉన్న ఒక చిన్న వివరాలను పట్టుకుని, ఇదే పెద్ద సాక్ష్యం అంటూ జగన్ చెప్పడం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఈ విషయంలోనే ఆయన టీడీపీకి అడ్డంగా దొరికిపోయారు.

జగన్ ఎలా దొరికిపోయారు?

వాస్తవానికి హెరిటేజ్ సంస్థ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. దానికి ఏ కంపెనీతో సంబంధాలు ఉన్నా అవి స్టాక్ మార్కెట్ నిబంధనల ప్రకారం బహిరంగంగానే ఉంటాయి. ఇండాపూర్ డైరీ కేవలం ‘చీజ్’ తయారీలో హెరిటేజ్ కి ఒక సహ-ఉత్పత్తిదారు మాత్రమే. కానీ జగన్ మాత్రం ఆ డైరీకి సంబంధించిన నెయ్యి మరకను హెరిటేజ్‌కు అంటించడానికి విశ్వప్రయత్నం చేశారు. అయితే తప్పుడు ఆధారాలతో మీడియా ముందుకు రావడంతో, టీడీపీ నేతలు జగన్ అజ్ఞానాన్ని ఎండగడుతున్నారు. “ఇండియా మార్ట్ స్క్రీన్ షాట్ తెచ్చి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మీ స్థాయికి తగునా?” అంటూ టీడీపీ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తోంది.

అంతేకాకుండా, గతంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టులు వర్కవుట్ అయ్యేవని, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్న ఇలాంటి సిల్లీ ఐడియాల వల్ల జగన్ పరువు పోతోందని టీడీపీ సెటైర్లు వేస్తోంది. జగన్ అమాయకంగా ముఖం పెట్టి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని, కానీ జనం ఇప్పుడు అంతా గమనిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి లడ్డూ కల్తీ నెయ్యి విషయంలో తనపై పడ్డ మరకను తుడుచుకోవాలని చూసిన జగన్, మరో తప్పుడు ఆరోపణతో మళ్ళీ దొరికిపోయి ప్రత్యర్థులకు మంచి అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పుడు టీడీపీ నేతలు ఆయన వేసిన ఈ మాస్టర్ ప్లాన్‌ను కామెడీగా మార్చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

siddhu

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి