Zodiac Signs : ఏప్రిల్‌ 09 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 8 April 2022, 10:40 pm

Zodiac Signs మేష రాశి ఫలాలు : సంతోషం కలిగించే రోజు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఆటంకాలతో పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా మందగమనం. మీరు శ్రమించాల్సిన సమయం. ఆనుకోని ప్రయాణాలు. కుటుంబంలో మార్పుల వల్ల ఇబ్బందులు. మహిళలకు చికాకులు. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.

Zodiac Signs మిథునరాశి ఫలాలు : ఇంట్లో, బయటా మీకు ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు. వ్యాపారాలు, పెట్టుబడులు అనుకూలిస్తాయి, అన్ని రకాల వృత్తుల వారికి మంచి ఫలితాలు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : కొంచెం మిశ్రమంగా ఉంటుంది. రోజు గడుస్తున్న కొద్ది ఆశావహంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాలలో విలువైన వస్తువులు జాగ్రత్త. కుటుంబంలో మార్పులు. మహిళలకు పని బార పెరుగుతుంది. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

today horoscope april 09 2022 check your zodiac sign

today horoscope april 09 2022 check your zodiac sign

సింహరాశి ఫలాలు : మీరు ధైర్యంగా ముందుకు పోతారు. ప్రతి పనిలోనూ శ్రద్ధ పెంచుతారు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. అనుకూలమైన రోజు. కుటుంబంలో సంతోషం. పిల్లల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. మహిలలకు శుభదినం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : మీరు శుభవార్తలు వింటారు. చాలాకాలంగా వేచి చూస్తున్న విద్యా, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అప్తుల నుంచి సహకారం పొందుతారు. మీరు చేసే పనులను వేగంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో శుభకార్యం. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.

Zodiac Signs తులారాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి జాగ్రత్త,. గ్రహచలనాల రీత్యా ఈరోజు మీరు అన్ని విషయాలలో శ్రద్ధ, ఓపికతో వ్యవహరించాల్సిన సమయం. ఆర్థికంగా సాధారణ స్తితి. వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త. అన్నదమ్ముల నుంచి సమస్యలు. ఇరుగుపొరుగుతో ఇబ్బంది రావచ్చు. శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్రకవచం కనీసం మూడు సార్లు చదువుకోండి.

Zodiac Signs వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక, విద్యా, ఉద్యోగ విషయాలలో కొంచెం జాగ్రత్త. అనుకోని వారి నుంచి లాభాలు వస్తాయి. సాయంత్రం నుంచి శుభంగా ఉంటుంది. అక్కచెల్లల్ల నుంచి శుభవర్తాలు వింటారు. ఇష్టదేవతారాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మీరు అనుకున్నదాని కంటే మంచి ఫలితాలు ఈరోజు సాధిస్తారు. అనుకోని అతిథి రాకతో ఇంట్లో సందడి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషం నిండిన రోజు. ఆర్థిక, ఉద్యోగ , వ్యాపార విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఇష్టదేవతారాధన చేయండి.

Zodiac Signs మకర రాశి ఫలాలు : మీరు శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు., శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. కుటుంబంలో సంతోషం. విష్ణు ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : చేసే పనులపై శ్రద్ధ ఉండదు. మనస్సులో ఆలోచనలు స్తిరంగా ఉండవు. ఆర్థిక మందగమనం. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. మహిలలకు పని వత్తిడి. శ్రీ రామ తారకాన్ని కనీసం 108 సార్లు చేయండి.

మీనరాశి ఫలాలు : కుటుంబంలో మంచి వాతావరణం. లాభాలతో కూడిన రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆనందంగా ఈరోజు ఎంజాయ్‌ చేస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మహిళలకు పని భారం. శ్రీ రామ ఆరాధన చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి