Zodiac Signs : ఏప్రిల్  24 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 23 April 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో సంతోషం నిండిన రోజు. ఆదాయం పెరుగుతుంది. వివాహ విషయాలు అనుకూలం. ఆర్థిక పురోగతి,. ప్రయాణ సౌఖ్యం. మంచి వార్తలు వింటారు. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : కొంత శ్రమించాల్సిన రోజు. అనుకోని మార్పులు సంభవిస్తాయి. ఆర్థికంగా సాధారణ స్థితి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అనారోగ్యం. ఇంట్లో పరిస్థితులు గందరగోళంగా మారతాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.

మిథున రాశి ఫలాలు : కుటుంబంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మిత్రులతో విబేధాలు సమసిపోతాయి. సంతోషం నిండిన రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మిత్రుల ద్వారా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అప్పులు తీరుస్తారు. ఇంట్లోకి విలువైన వస్తువులు కొంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అనుకోని ప్రయాణాల చేస్తారు. లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope april 24 2022 check your zodiac signs

Today Horoscope april 24 2022 check your zodiac signs

సింహ రాశి ఫలాలు : మీరు చేసే పనులు వేగంగా పూర్తిచేస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు విజయం. ఇష్టదేవతారాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : మీరు చేసే పనికి తగ్గ ఫలితం రాదు. మనస్సు స్థిరంగా ఉండదు. ఆలోచనలు పరిపరి విధాలుగా పోతుంది. అప్పులు కోసం ప్రయత్నిస్తారు. ఇంటా, బయటా మీపై బాధ్యతలు పెరుగుతాయి. మహిళలకు చికాకులు. శ్రీ శివాభిషేకం చేయండి.

తులారాశి ఫలాలు : మంచి ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషం. శుభకార్యాలకు హాజరవుతారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అరోగ్యం బాగుంటుంది. మహిళలకు లాభాలు. వస్త్ర లాభం. గోసేవ చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మీరు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. ఆప్తుల నుంచి ధనలాభాలు. మీరు చేసే ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు శుభ వార్తలు. ఆర్థిక పురోగతి. మహిళలకు ధన లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : తప్పులు చేస్తారు. అప్పులు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఇబ్బందులతో సతమతం. అనుకోని ఖర్చులు. బంధువుల తాకిడి. విందులు, వినోదాలు. మహిలలకు పనిభారం. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : మీరు చేసే పనులను వేగంగా, ఉత్సాహంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో శుభకార్య యోచన. అనుకోని వారి ద్వారా శుభవార్తలు వింటారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. విహారం, క్షేత్ర సందర్శనకు ప్లాన్‌ చేస్తారు. శ్రీ హనుమాన్‌ ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఇబ్బందులు. కుటుంబంలో అనుకోని మార్పులు. అర్థిక మందగమనం.
మహిళలకు పని భారం పెరుగుతుంది. శత్రువుల బాధ. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మీరు చేసే అన్నింటా విజయం సాధిస్తారు. అప్తుల నుంచి ధనలాభాలు పొందుతారు. కుటుంబంలో సంతోషం. విద్యార్థులకు శ్రమకు తగ్గ పలితం. విలువైన వస్తువులు కొంటారు. మహిళలకు లాభ సూచన. మంచిరోజు. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి