Zodiac Signs : ఆగస్టు 12 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఆగస్టు 12 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By aruna | The Telugu News | Updated on :11 August 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : ఈరోజు మీరు ఉత్సాహంగా పనుల పూర్తి చేస్తారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు. శ్రీలక్ష్మీదేవిని అష్టోతరంతో ఆరాధన చేయండి.వృషభ రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది ఎదురవుతుంది. ఆనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అమ్మతరపు వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. ప్రయాణ సూచన. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ప్రయాణ సూచన. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : చక్కటి శుభకరమైన రోజు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో చక్కటి సానుకూల ఫలితాలు. దైర్యంతో ముందుకుపోతారు. అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మంచి వస్తులాభాలు వస్తాయి. ఆనుకోని మార్గాల ద్వారా లాభాలు కలుగుతాయి. మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. ధనలాభాలు కలుగుతాయి. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చక్కటి లాభదాయకమైన రోజు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope August 12 2022 Check Your Zodiac Signs

Today Horoscope August 12 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ వచ్చిన ధనం సరిపోదు. ఆస్తి విషయాలలో వివాదాలు వస్తాయి. అన్నదమ్ముల నుంచి సహకారం వస్తుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. అమ్మవారి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. చేసే పనులలో ఇబ్బందులు. చేసే పనుల్లో స్వల్ప ఆటంకాలు. అనుకోని ఖర్చులు వస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. ఇంటా, బయటా చికాకులు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : కుటంబంలో అనుకోని మార్పులు జరిగే అవుతాయి. చేసే పనులలో వేగం పెరుగుతాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభఫలితాలను పొందుతారు. విద్యా, ఉపాధి విషయాలలో చక్కటి రోజు. ఇంట్లో మీరు శుభకార్య యోచన చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆఫీస్‌లో పరిస్థితి మెరుగుపడుతుంది. చాలాకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం. కుటుంబం సభ్యుల నుంచి ధనలాభం. వైవాహికంగా చక్కటి రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు కష్టంగా ఉంటుంది. అనుకోని వివాదాలు వస్తాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. రుణ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి,. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : మీరు ఊహించిన విధంగా ఈరోజు గడుస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మంచి గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొంటారు. అన్ని విషయాలలో పురోగతి కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : సామాన్యంగా ఉంటుంది ఈరోజు, ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో సామన్యంగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. అనుకోని వివాదాలు రావచ్చు. ప్రయాణ సూచన కనిపిస్తుంది. అనారోగ్యం. బంధవుల నుంచి వత్తిడులు వస్తాయి. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : మీకు మంచి శుభవార్తలు అందుతాయి. ఉత్సాహంగా ఈరోజు గడుపుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు. కుటంబంలో సంతోషకరమైన వాతావరణం. నిరుద్యోగులకు ఆశాజనకమైన రోజు. అన్ని వ్యవహారాలలో సానుకూలతలు కనిపిస్తున్నాయి. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధనతోపాటు అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది