Home » Devotional » Today Horoscope August 18 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఆగస్టు 18 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: August 17, 2022, 9:20 pm
Advertisement

మేష రాశి ఫలాలు : ఈరోజు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. ఆర్థికంగా పర్వాలేదు. కానీ ఖర్చులు విపరీతంగా అవుతాయి. అనారోగ్య సూచన కనిపిస్తుంది. పని బారం పెరుగుతుంది. మంచి చేద్దామనుకున్నా చెడు అవుతుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : అన్ని రకాలుగా బాగుంటుంది. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఈరోజు విలువైన వస్తువులను కొంటారు. కుటుంబంలో శుభకార్యాల ఆలోచన చేస్తారు. మిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు. మహిళలకు మంచి లాభాదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : అన్నింటా విజయం సాధిస్తారు. సకాలంలో ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.దూర బంధవుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకు అనుకూలం. ఇంటా, బయటా మీకు అనుకూలమైన వాతావరణం. మహిళలకు శుభదినం. ఇష్టదేవతరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీరు కొత్త కొత్త మార్గాలలో ఆదాయం సంపాదించాలని ప్రణాళికలు వేసుకుంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. భార్య తరపు వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యా, ఉపాధి విషయవంలో అనుకూలత కనిపిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులకు, అన్ని రకాల వృత్తుల వారికి అనుకూలం. సుబ్రమణ్య స్వామి భుజంగం చదువుకోండి.

Today Horoscope August 18 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : అన్ని వివాదాలు సమసిపోతాయి. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ధన లాభాలు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ రామ తారకాన్ని జపించండి.

కన్య రాశి ఫలాలు : ఈరోజు కొంత ప్రతికూలత కనిపిస్తుంది. విద్యా, వివాహ ప్రయత్నాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. పెట్టుబడులలో నష్టాలు వస్తాయి.మహిళలకు ఇబ్బందికరమైన రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు వస్తాయి. దూర ప్రయాణ సూచన. పనులలో మందత్వం కనిపిస్తుంది. ఆదాయం తగ్గుతుంది. ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. ఇంట్లో సమస్యలు వస్తాయి. మహిళలకు చికాకులు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : చేసే పనులు సకాలంలో పూర్తిచేస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలుగుతాయి. ఆఫీస్‌లో పనులు వేగంగా పూర్తి చేస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభాలు వస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మహిళలకు ధనలాబాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : వివాహ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ధనాన్ని పొదుపు చేస్తారు. మంచి వార్తలు వింటారు. కుటుంబానికి శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవం. వాహన సౌఖ్యం. విద్యా, ఉపాధి అనుకూలత పెరుగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో మార్పులు జరుగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. కొత్త పెట్టుబడులకు అవకాశం. మహిళలకు, పిల్లలకు మంచిరోజు. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ఇబ్బందికరమైన రోజు. ఆర్థిక మందగమనం. ఆస్థి సంబంధ వివాదాలకు అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. బంధువుల నుంచి వత్తిడి వస్తుంది. దూర ప్రయాణ సూచన కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలించవు. శ్రీ దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో అనుకూలతలు కనిపిస్తున్నాయి. మంచి వార్తలు వింటారు. దూర ప్రయాణ సూచన. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మహిళలకు మంచి రోజు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి