Zodiac Signs : ఆగస్టు 27 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By aruna | The Telugu News | Published on: August 26, 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టంగా గడుస్తుంది. అనుకోని నష్టాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అనుకోని ప్రయాణాలు. ఇంట్లో సమస్యలు. అనారోగ్యం. మహిళలకు చిక్కులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం కొంచెం పెరుగుతుంది. కుటుంబంలో, ఇంటా, బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : అనుకోని వారితో ఇబ్బందులు వస్తాయి. బంధువులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. పనులు వాయిదా. వ్యాపారాలలో ఇబ్బందులు. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అనుకోని వారి నుంచి లాభాలు. చేసే పనులలో వేగంగా పూర్తి చేస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాన్వేషణలో విజయం. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope August 27 2022 Check Your Zodiac Signs

Today Horoscope August 27 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : పనులు మందగిస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ఆఫీస్‌లో వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. బంధువుల కలయిక. వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటుంది. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో అనుకూలత. విదేశీ ప్రయాణ సూచన. విద్యార్థులు శుభసూచకంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : కొత్త కొత్త మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఆఫీస్‌లో ప్రశంసలు అందుతాయి. కొత్త ఉద్యోగ అవకాశం ఉంది. ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. మహిళలకు లాభాలు. వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆదాయ పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో ప్రతిబంధకాలు. అనారోగ్యం. వ్యాపారాలు స్వల్ప నష్టాలు వస్తాయి. మహిళలకు మనః ప్రశాంతత తగ్గుతుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. కుటుంబంలో చక్కటి పరిస్థితులు ఉంటాయి. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అనుకోని ప్రయాణాలు. పనుల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు ధనలాభాలు వస్తాయి. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభఫలితాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో మంచి గౌరవం లభిస్తుంది. సమాజంలో మీ విలువ, కీర్తి పెరుగుతుంది. ధనలాభాలు. చాలా కాలంగా ఉన్న వివాదాలు తీరతాయి. ఇష్టదేవతరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక మందగమనం. ప్రయాణ సూచన కనిపిస్తుంది. అన్నింటా మీకు ఇబ్బందులు వస్తాయి కానీ వాటిని మీరు అధిగమిస్తారు. చేసే పనులలో అవాంతరాలు తొలగుతాయి. సాయంత్రం నుంచి ఉత్సాహంగా గడుపుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు చేసే ప్రతి పనిలోనూ మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూర ప్రాంతం నుంచి అందిన వార్త మీ కుటుంబానికి సంతోషాన్నిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. విద్యా, ఉపాధి విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp