Zodiac Signs : డిసెంబర్ 12 ఆదివారం.. ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Advertisement
Advertisement
మేషరాశి ఫలాలు : ఆర్థికంగా బాగుంటుంది. అనుకున్న విధంగా ఆర్థిక వ్యవహారాలు సాగుతాయి. చాలా కాలంగా ఉన్న సమస్యలు కొన్ని తీరుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. అనుకోని చోట నుంచి ఒక శుభ వర్తమానం అందుతుంది. వ్యాపారాలు బాగా సాగుతాయి. మహిళలకు మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. హనుమంతుడిని ఆరాధించండి. వృషభరాశి ఫలాలు.. : ఈరోజు పెద్దల సలహాలతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఏ కార్యం చేపట్టినా విజయం మీ సొంతం. కొత్త వస్తువులు, వాహనాలు కొనే ప్రయత్నం చేస్తారు. వ్యాపారాలు విస్తరణకు అవకాశం ఉంది. మహిలలకు మంచి పేరుతోపాటు ఆహ్వానాలు అందుతాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మిథునరాశి ఫలాలు : పెద్దలతో పరిచయాలు, గత విషయాలను గుర్తుచేసుకుని భవిష్యత్కు ప్లాన్ చేసుకుంటారు. కొత్త ఉత్సాహంతో పనులు చేస్తారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. సమస్యల పరిష్కారం. మహిళలకు సమస్యలు తీరుతాయి.   శ్రీగణపతి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మహిళలకు మాటపట్టింపులు వస్తాయి. మీ విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక విషయాలలో గందరగోళం. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన   చేయండి.

Today Horoscope december 12 2021 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు. అప్పులు చేయాల్సి రావచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలం. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మహిళలు అన్ని విషయాలలో ఈ రోజు జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయరంగం వారికి ఆటుపోట్లు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఆర్థికంగా నిరాశజనకంగా ఉంటుంది. పాత బాకీలు అంతే ఉంటాయి. పనులలో జాప్యం జరుగుతుంది. కొత్త వాహనాలు, వస్తువులు కొంటారు. చాలాకాలంగా పడిన శ్రమకు గుర్తింపు లభిస్తుంది. మానసిక సంతృప్తి. వ్యాపారులకు, రాజకీయనాయకులకు,   ఉద్యోగులకు లాభదాయకమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి,.
తులారాశి ఫలాలు : మంచి అనుకూలమైన రోజు. అన్నింటా జయం. ఆర్థిక పరిస్తితులు బాగుంటాయి. మీకు వచ్చే కొత్త ఆలోచనలను అమలు చేస్తారు.   భూములు, బంగారం వంటివి కొనే ప్రయత్నం చేస్తారు. వ్యాపారులకు, రాజకీయనాయకులకు, ఉద్యోగులకు శుభదాయకమైన రోజు. మహిళలకు అనుకూలమైన ఫలితాలు. ఆంజనేయస్వామి దండకం పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు పనులు నిదానంగా ఉంటాయి. ధనం అవసరానికి చేతికి అందుతుంది. అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యాక్రమాలలో పాల్గొంటారు. కార్యాలయాలలో పని వత్తిడి పెరుగుతుంది. మహిళకు ఆందోళన కలుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. .. బంధువులతో, మిత్రులతో విబేధాలు. కుటుంబంలో అనుకోని మార్పులు. అనుకోని ప్రయాణాలు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయటా అదనపు బాధ్యతలు జరుగుతాయి. శ్రీకాలభైరావాష్టకం పారాయణం చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు గతంలో చేసిన పనుల వల్ల లాభాలు వస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం కోసం శ్రద్ధ పెట్టాల్సిన రోజు. ఆర్థిక వ్యవహారాలలో ఇబ్బంది. మహిళలక అనుకోని వివాదాలు రావచ్చు. నవగ్రహస్తోత్రపారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు చాలాకాలంగా వాయిదా పడుతున్న సమస్యలు తీరుతాయి. మిత్రుల కలయికతో మానసిక ఆనందం. ఆర్థికంగా మంచి మెరుగుదల. రియల్ ఎస్టేట్, కిరాణం, పాల వ్యాపారులకు అనకూలం. శత్రువులతో సఖ్యత చేకూరుతుంది. రాజకీయనాయకులకు, ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు మంచిరోజు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు చాలా ముఖ్యమైనరోజు. మీ ఆలోచనలకు పదను పెట్టాల్సిన సమయం. ఆర్థికంగా ఇబ్బంది. దగ్గరి వారితో విబేధాలు. కుటుబంలో అనుకోని సమస్యలు రావచ్చు. వ్యాపారాలలో పెద్ద లాభాలు రావు. చిల్లర వ్యాపారులకు సాధారణ స్థితి కనిపిస్తుంది. మహిళలకు మానసిక అశాంతి. శ్రీ శివ, విష్ణు ఆరాధన చేయండి.
Advertisement
Advertisement

Recent Posts

Nari Nari Naduma Murari : బాలకృష్ణ పరువు నిలబెట్టిన యంగ్ హీరో !!

సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…

14 minutes ago

Chiranjeevi Davos : దావోస్ కు చిరంజీవి ఎందుకు వెళ్లినట్లు..? అక్కడ సీఎం రేవంత్ పని ఏంటి ?

Chiranjeevi Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…

53 minutes ago

Kisan Vikas Patra 2026 : పోస్ట్ ఆఫీస్‌లో సూపర్ హిట్ పథకం..ఒక్కసారి పెట్టుబడి పెడితే కాలక్రమేణా రెట్టింపు..వివరాలు ఇవే!

Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…

1 hour ago

Gold Price on Jan 21 : తగ్గినట్లే తగ్గి..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర..ఈరోజు తులం బంగారం ఎంతంటే?

Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…

3 hours ago

Karthika Deepam 2 Today Episode : జ్యోత్స్న రహస్యం బయటపడే ప్రమాదం.. ఆగ్రహంతో ఊగిపోయిన శివ నారాయణ

Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…

4 hours ago

Box Office 2026 : టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో సువర్ణ అధ్యాయం .. 10 రోజులు, 5 సినిమాలు, 800 కోట్లు..!

Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…

4 hours ago

Home Remedies: ఇంట్లో కీటకాల బెడదకు చెక్: రసాయనాలు లేకుండా ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే పరార్..!

Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…

5 hours ago

Blue Berries : బ్లూ బెర్రీ తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అసలు వదులరు అవేంటో తెలుసా?

Blue Berries : మార్కెట్‌లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…

6 hours ago