Zodiac Signs : డిసెంబర్ 14 మంగళవారం ఈరాశి వారు ఈరోజు అనుకోని మార్గాల ద్వారా లాభాలు ఆర్జిస్తారు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : డిసెంబర్ 14 మంగళవారం ఈరాశి వారు ఈరోజు అనుకోని మార్గాల ద్వారా లాభాలు ఆర్జిస్తారు !

 Authored By prabhas | The Telugu News | Updated on :13 December 2021,10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇంటా, బయటా పని వత్తిడి ఎక్కువ అవుతుంది. పక్కవారితో విభేదాలు. ఆధ్యాత్మిక ఆలోచనలు, దేవాలయ దర్శనాలు. వ్యాపారాలలో మార్పులు. ఆర్థికంగా సాధారణ స్థితి. మంచి ఫలితాల కోసం శ్రీ దుర్గాదేవిని మందారాలతో అర్చన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ముఖ్య వార్తలు, శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు విజయం. ఆఫీస్‌లలో పనిచేసేవారికి ఒడిదుడుకులు. శుభ ఫలితాల కొరకు శ్రీ ఆంజనేయస్వామి దండకాన్ని చదువుకోండి, దేవాలయం వెళ్లి రండి.

మిధునరాశి ఫలాలు : అనుకూలమైన వాతావరణం. సమాజంలో మంచి పేరు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు మీకు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల కలయిక, మహళలకు మంచి రోజు. శుభ ఫలితాల కోసం కుజగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షణ చేయండి., కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అనవసర విషయాలలో తలదూర్చకండి. గ్రహచలనాలు అనుకూలత తక్కువగా ఉంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. దగ్గరి వారితో వాదనలకు అవకాశం జాగ్రత్త. ఆర్థిక మందగమనం.కుటుంబ పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. శుభ ఫలితాల కోసం అమ్మవారి దగ్గర ఎర్రటి వత్తులతో దీపారాధన చేయండి.

Today Horoscope

Today Horoscope

సింహరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో విసుగు వస్తుంది. వాహనాల ప్రయాణం జాగ్రత్తగా చేయండి. అనుకోని ప్రయాణాలు, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులకు అవకాశాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేయాలి. మహిళలకు కొంచెం ఇబ్బదికరమైన రోజు. శుభ ఫలితాల కోసం శ్రీ దుర్గా సూక్తం, అమ్మవారి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు పాత బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా మంచి స్థితి కలిగి ఉంటారు. కుటుంబ సమావేశాలలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. పిల్లల ద్వారా సంతోషం కలుగుతుంది. దూరపు బంధువుల కలయిక. మహిళకు పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభ ఫలితాల కోసం శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా కాలం గడుస్తుంది. చిల్లర, కిరాణం, రియట్‌ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారికి అనుకూలమైన రోజు. లాభాలు వస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దల పరిచయాలు. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అనవసర ఆందోళనలు. పనికి తగ్గ గుర్తింపు లేక ఇబ్బందులు పడుతారు. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. అనుకోని విషయాలలో ఇబ్బందులు. పరిస్థితులు నిరాశ కలిగిస్తాయి. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో పెద్దల సలహాలు వినకపోవడం వల్ల ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, వ్యాపారాలు సాఫీగా సాగవు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. బాకీలు చేసిన వారికి వత్తిడి పెరుగుతుంది. రుణ అంగారక స్తోత్రం పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు శుభ సమయం. శుభవార్తలు వింటారు. కొత్త వస్తువులు, విలువైన ఆభరణాలు కొనుగోలకు ప్రయత్నాలు చేస్తారు. రియల్‌, ఇనుము, పాల వ్యాపారులకు లాభదాయకమైన రోజు. కుటుంబ సభ్యులు కలసి ముఖ్య నిర్ణయాలు. విద్యార్థుల అంచనాలు ఫలిస్తాయి. శుభ ఫలితాల కోసం మణిద్వీప వర్ణన పారాయణం చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు. వ్యాపారాలు పెద్దగా సాగవు. ముఖ్యంగా పరిచయం లేని వారితో కలసి కొత్త పనులు చేయకండి. కుటుంబ సభ్యుల మధ్య పని వత్తిడి పెరుగుతుంది. మహిళలకు పక్కవారితో అనవసర విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు అనుకోని మార్గాల ద్వారా లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం చేస్తారు. పిల్లల ద్వారా మంచి విషయాలు తెలుసుకుంటారు. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులు, విద్యార్థులకు మంచిరోజు. మహిళకు స్వర్ణ ఆభరణాల కొనుగోలకు ప్రయత్నం చేస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది