zodiac signs : డిసెంబర్ 25  శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 24 December 2021, 10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనుకోని విధంగా పనులు వాయిదా పడుతాయి. నెమ్మదిగా ముఖ్యమైన విషయాలను చేస్తారు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. విద్యార్థులకు ఇబ్బందులు. మహిళలకు అనారోగ్య కలుగవచ్చు జాగ్రత్త. నవగ్రహాలకు ప్రదక్షణ చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. అనుకున్న విధంగా వ్యాపారాలలో లాభాలు రావు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మహిళలకు అనుకోని వివాదాలు ఎదురవుతాయి. మనస్సు స్థిరంగా ఉండదు. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా అనుకూల ఫలితాలు. ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. కుటుంబంలో సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఐటీ, మేనేజ్మెంట్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. మహిళలకు మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. శ్రమ పెరుగుతుంది. ఆదాయం అనుకున్న విధంగా రాదు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. మహిళలకు అనారోగ్య సూచన. అనుకోని ప్రయాణాలు. శ్రీఅలివేలుమంగా వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope december 25 2021 check your zodiac signs

Today Horoscope december 25 2021 check your zodiac signs

సింహారాశి ఫలాలు : ఆనందంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. పారిశ్రామిక వర్గాల వారికి లాభాలు. కుటుంబంలో ఆశ్చర్యకరమైన మార్పులు సంభవిస్తాయి. అనుకోని వ్యక్తుల కలయిక. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఆర్థిక వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపారాలు సజావుగా సాగవు. కుటుంబంలో వివాదాలు. పనులు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు అన్నింటా విజయం. పనులు వేగంగా పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఐటీ, ఆర్టిస్ట్, విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. మహిళలకు మంచి గౌరవం లభిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : చాలా కాలంగా వాయిదా పడుతున్నపనులు పూర్తిచేస్తారు. మహిళలకు మంచి వార్తలు వింటారు.స్వర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఆశించిన దానికంటే మంచిగా ఉంటాయి. పెద్దల సహకారం లభిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : పనులు ముందుకు సాగవు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అనుకోని మార్పులు. కుటుంబంలో నిస్తేజ వాతావరణం.అన్ని రంగాల వారికి ఇబ్బందులు, నిరాశజనకంగా ఉంటాయి. శ్రీ విష్ణు సహస్ర నామాలను పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : అనవసర ఖర్చులు. వివాదాలకు అవకాశం. ఆఫీస్లో పనివత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో మార్పులు, అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఇంటా, బయటా చికాకులు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్రకవచం పారాయణం చేయండి,.

కుంభరాశి ఫలాలు : ఇంటా, బయటా అన్ని పనులు సజావుగా సాగుతాయి. శుభకార్య ప్రయత్నం. సన్మానాలు, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాల ద్వారా సంపాదిస్తారు. మహిళలకు మంచి అవకాశాలు వస్తాయి. రియల్, షేర్ స్టాక్ రంగాలలో ఉన్నవారికి లాభాలు. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు పనులను వేగంగా, ఉత్సాహంగా పూర్తిచేస్తారు. అనుకోని శుభవార్తలు వింటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. కొత్త వాహనాలు, ఆభరణాలు కొనుగోలకు ప్రయత్నిస్తారు. మంచి పనులు చేస్తారు. విద్యార్థులకు, కళాకారులకు, మహిళలకు, ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రియమైనవారికి బహుమతులు అందజేస్తారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి