Zodiac Signs : డిసెంబర్ 6 సోమవారం ఈరాశి వారు ప్రియమైన వారి నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు !
మేషరాశి ఫలాలు : చాలాకాలంగా అనుభవిస్తున్న టెన్షన్ల నుంచి బయటపడనున్నారు. ఆనందంగా గడుపుతారు. ధనలాభాలు రాక ఇబ్బంది పడుతారు. ప్రియమైన వారు మీ మాటలు వినకపోవడం వల్ల కోపం వస్తుంది. సాధారణ జీవితాన్ని ఈరోజు గడుపుతారు. మానసిక ప్రశాంతత కోసం గాయత్రి మంత్రాన్ని జపించండి.వృషభ రాశి ఫలాలు : ఈరోజు బిజీగా గడుపుతారు. ముఖ్యంగా పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను, లాభాలను పొందుతారు. ఇంటివద్ద పనులతో బిజీగా గడుపుతారు. కష్టపడి పని చెయ్యడం ఓర్పు ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మంచి ఆరోగ్యాన్ని పొందడానికి కాలభైరవుడిని పూజించండి.
మిథున రాశి ఫలాలు ; ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. అనుకోన అతిథుల రాకతో సందడిగా ఉంటుంది. ఆర్ధికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. మీ ప్రేమ జీవితం ఈ రోజు అందిస్తుంది. కెరీర్ పెరుగుదలకు కష్టపడుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.కర్కాటక రాశి ఫలాలు ; ఈరోజు మానసిక వత్తిడి ఉంటుంది. ధనం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో లాభాలు అనుకున్నంత రావు. పిల్లలకు చదువుపట్ల శ్రద్ధ ఉండదు. అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండదు. ప్రయాణాలు కలసిరావు. మహాదేవుడి ఆరాధన చేయండి.

Today horoscope december 6 2021 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు మంచి లాభాలు వస్తాయి. అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. అప్పులు చెల్లించాల్సి వస్తుంది. ప్రేమికులకు సంతోషమైన రోజు. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరెంతో ఆనందంగా గడుపనున్నారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు : ఈరోజు ముఖ్యమైన విషయాలను దగ్గరి వారి నుంచి తెలుసుకుంటారు. ధనం విషయంలో జాగ్రత్త. పెద్దల సలహాలను తీసుకోకుండా ముందుకు వెళ్లకండి. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్ కౌంటర్, మీ హుషారును పెంచుతుంది. ఆఫీస్‌లో సమస్యలు వస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామ నామాన్ని 108 సార్లు పారాయణం చేయండి.
తులా రాశి ఫలాలు : ఈరోజు అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. ధన లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు కలుగవచ్చు. శ్రీకృష్ణారాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక విషయాలలో మంచి లాభాలను గడిస్తారు. అధిక ఖర్చులకు దూరంగా ఉండండి. మీ డార్లింగ్ ఇవాళ మీకోసం ఎదురుచూస్తారు. వ్యాపారవేత్తలకు అకస్మాత్తుగా అనుకోని లాభాలు వైవాహిక జీవితం చక్కగా, పవిత్రంగా సాగిపోతుంది.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు అనుకూలమైన రోజు. ఆత్మ గౌరవం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు చివరిదశకు వస్తాయి. మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వండి. కష్టాల నుంచి విముక్తి పొందడానికి కుటుంబ సభ్యులు సహాయం చేస్తారు. అనుకోని లాభాలు వస్తాయి.
మకరరాశి ఫలాలు : ఈరోజు సమయాన్ని వృథా చేయకండి. ఆర్థిక పరిస్థితులలో పెరుగుదల కనిపిస్తుంది. వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి మంచి సమయం. శాస్త్రోక్తమైన వేడుకలు ఇంటిలో నిర్వహిస్తారు. రొమాంటిక్ పాటలుమూన్ లైట్ డిన్నర్తో ఆనందంగా గడుపుతారు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు ఫుల్ శక్తితో పనులు పూర్తిచేస్తారు. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత చేయండి. ఈరోజు ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. స్నేహితుల ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. శ్రీశివారాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. క్రీడలలో పాల్గొంటారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ప్రియమైన వారి నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థిక పరిస్తితులు అనుకూలంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. టీనేజ్ రోజులు గుర్తుకు వచ్చేలా జీవిత భాగస్వామి ప్రవర్తిస్తుంది.ఇష్టదేవతారాధన చేయండి.