Zodiac Signs : ఫిబ్రవరి 03 రాశి ఫలాలు ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Devotional Desk | The Telugu News | Published on: February 2, 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : మంచి ఆర్థిక పురోగతి ఉండే ఈ రోజు. అనుకోని లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తున్నాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులు,ఉద్యోగులకు మంచి వార్తలు. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఆదాయం అనుకున్నంత రాదు. వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల చికాకులు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. మహిళలకు వివాదాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిధునరాశి ఫలాలు : శ్రమ బాగా పెరుగుతుంది. ఆశించిన ఆర్థిక వృద్ధి ఉండదు. పాలు, కూరగాయలు, హోటల్‌ వ్యాపారులకు కొంచెం లాభాలు వస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. మహిళలకు అనుకోని లాభాలు వస్తాయి. శ్రీ సాయిబాబ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. అనుకోని చోట నుంచి ధనం వస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విందులకు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope february 03 2022 check your zodiac signs

Today Horoscope february 03 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అన్ని రకాల పనులలో విజయం సాధిస్తారు. దూరపు ప్రాంతం నుంచి ఊహించిన శుభవార్తలు వింటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు వస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఆటంకాలతో అనుకున్న పనులు ముందుకు సాగవు. కుటుంబంలో సమస్యలు రావచ్చు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు ఆశించిన అంత ముందుకు పోవు. ఉద్యోగులకు స్తాన చలనం. మహిళలకు మంచి ఫలితాలు. శ్రీ కామాక్షీ అమ్మవారిని ఆరాధించండి.

తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. పెరిగే ఖర్చుల వల్ల ఇబ్బందులు. పని భారం పెరుగుతుంది. ఆస్తి సమస్యలు పెండింగ్లో ఉంటాయి. వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. బంధువుల నుంచి సమస్యలు రావచ్చు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : సమస్యలు తీరిపోతాయి. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో మంచి ఫలితాలు వస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. విదేశీ యానం, విద్య విషయాలకు అనుకూలమైన రోజు. మహిళలకు మంచి వార్తలు వింటారు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : పరిస్థితులు నిరాశజనకంగా ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి కావు. ధనం ఆశించినంత సంపాదించలేరు. అన్ని వృత్తుల వారికి సాధారణంగా ఉంటుంది. ఐటీ, రియల్ రంగం వారికి లాభాలు. ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : సజావుగా రోజు గడిచిపోతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. బంధువర్గం నుంచి లాభాలు. రియల్, ఐటీ, ఫ్యాన్సీ రంగాల వారికి శుభ సమయం. మహిళలకు సంతోషం. ఇష్టదేవతరాధన చేయండి,.

కుంభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో వివాదాలు. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులు కొంటారు. మహిళలకు అనుకోని ధనలాబాలు వస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ సమాచారం అందుతుంది. ధన లాభలు వస్తాయి. మహిళలకు వస్త్రలాభం. శ్రీ కనక దుర్గాదేవి ఆరాధన చేయండి.

Devotional Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp