Zodiac Signs : ఫిబ్రవరి 09 బుధవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషరాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారులకు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. విద్యార్థులు, ఉద్యోగులకు పని భారం పెరిగినా ఫలితం ఆశించినంత వస్తుంది. శ్రీగణపతి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొంచెం శ్రమతో కూడిన రోజు. నెమ్మదిగా పనులు పూర్తిచేస్తారు. అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చులు వస్తాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. కార్యాలయాలలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మహిళలకు చికాకులు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రశాంత వాతావరణంలో భవిష్యత్ నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. కులవృత్తుల వారికి అనుకోని లాబాలు వస్తాయి. మహిళలకు లాభాలు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : చక్కటి లాభదాయకమైన రోజు. ఆనుకోని లాభాలు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విందులు, వినోదాలల్లో పాల్గొంటారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. మహిళలకు ధనలాభాలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేస్తుంది.

Today Horoscope february 09 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : పెద్దల మెప్పు పొందుతారు. అనుకోని ఖర్చులు వస్తాయి. విద్యార్థులకు శ్రమతో కూడిన రోజు.
కుటుంబంలో అనుకోని మార్పులు జరుగుతాయి, ప్రయాణాల వల్ల చికాకులు కలుగుతాయి. అనుకోని చోట నుంచి శుభవార్తలు వస్తాయి. మహిళలకు మంచిరోజు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మంచి ఫలితాలను సాధిస్తారు. ఆనుకోని మార్గాల ద్వారా ఆదాయాలను పొందుతారు. పెద్దల ఆశీర్వాదంతో కొత్త పనులు లేదా ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. విజయాలను సాధిస్తారు. సంతోషదాయకమైన రోజు. మహిళలకు శుభం. ఇష్టదేవతరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మీ కలలు నెరవేరడానికి అవకాశం కనిపిస్తుంది. ఆఫీస్‌లో పెద్దల సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. వ్యాపారాలు నిర్వహించే వారికి లాభదాయకంగా ఉంటుంది ఈరోజు. బంధువుల సమాగమం. మహిళలకు పండుగ వాతావరణం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.
వృశ్చికరాశి ఫలాలు : శుభ ఫలితాలతో ఈరోజు గడుస్తుంది. అనుకున్న వాటిని సాధిస్తారు. విద్యార్థులకు శుభ సమయం. తలచిన ప్రాజెక్టు లేదా పనిని పూర్తిచేయడానికి మంచి రోజు. శుభకార్య నిర్వహణకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు, ఉద్యోగులకు మంచి రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలతో ఉత్సాహంగా సాగుతుంది ఈరోజు. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. మీ తెలివితేటలను ఉపయోగించాల్సిన సమయం. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మహిళలకు వస్త్రలాభం. శ్రీవినాయక ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ధైర్యంతో చేసే పనులలో విజయం సాధిస్తారు. ఆలోచనలలో స్థిరత్వం కొరవడుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలను సాధిస్తారు,. వ్యాపార వర్గాలకు అనుకూలం. మహిళలకు శుభ సమయం. శ్రీ లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : దూరపు ప్రాంతాల నుంచి వచ్చిన వార్త కుటుంబానికి అంతటికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. పాలు, కూరగాయాలు, మెడికల్ వ్యాపారాలు చేసేవారికి లాభాదాయకంగా ఉంటుంది. శుభకరమైన రోజు. శ్రీసుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : చక్కటి రోజు. ఆనందంగా గడిచిపోతుంది. ఆర్థిక విషయాలలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారలావాదేవీలు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులకు మంచి రోజు. ఉద్యోగులకు స్థానచలనానికి అవకాశం కనిపిస్తుంది. పెద్దల సలహాలు తీసుకోకుండా నిర్ణయాలు, పెట్టుబడులు ఈరోజు పెట్టకండి. మహిళలకు పనిభారం పెరుగుతుంది. శ్రీ హేరంబ గణపతి ఆరాధన చేయండి.