Karthika Deepam 2 February 12th 2026 Episode : కార్తీక దీపం 2 ఫిబ్రవరి 12, 2026 ఎపిసోడ్ : జ్యోత్స్న ‘నవరసాల’ నటనకు కార్తీక్ అదిరిపోయే కౌంటర్.. డ్రైవర్‌గా ఇంటికొచ్చిన కాశీ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 2 February 12th 2026 Episode : కార్తీక దీపం 2 ఫిబ్రవరి 12, 2026 ఎపిసోడ్ : జ్యోత్స్న ‘నవరసాల’ నటనకు కార్తీక్ అదిరిపోయే కౌంటర్.. డ్రైవర్‌గా ఇంటికొచ్చిన కాశీ!

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 February 2026,8:30 am

Karthika Deepam 2 February 12th 2026 Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ ‘కార్తీక దీపం 2’ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 12న ప్రసారమైన 592వ ఎపిసోడ్ Episode 592 లో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కార్తీక్, దీప కలిసి సుమిత్ర ప్రాణాలను కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం, మధ్యలో జ్యోత్స్న వింత ప్రవర్తన, కాశీ ఎంట్రీ ఈ ఎపిసోడ్ హైలైట్స్. అసలు ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Karthika Deepam 2 February 12th 2026 Episode కార్తీక దీపం 2 ఫిబ్రవరి 12 2026 ఎపిసోడ్ జ్యోత్స్న'నవరసాల' నటనకు కార్తీక్ అదిరిపోయే కౌంటర్.. డ్రైవర్‌గా ఇంటికొచ్చిన కాశీ!

Karthika Deepam 2 February 12th 2026 Episode : కార్తీక దీపం 2 ఫిబ్రవరి 12, 2026 ఎపిసోడ్ : జ్యోత్స్న ‘నవరసాల’ నటనకు కార్తీక్ అదిరిపోయే కౌంటర్.. డ్రైవర్‌గా ఇంటికొచ్చిన కాశీ!

Karthika Deepam 2 February 12th 2026 Episode : జ్యోత్స్న నటనకు కార్తీక్ చురకలు

సుమిత్రకు ఆపరేషన్ జరగాల్సి ఉండగా, బ్లడ్ శాంపిల్స్ జ్యోత్స్నవి మ్యాచ్ అయినట్లు కార్తీక్, దీప మేనేజ్ చేస్తారు. అయితే ఈ విషయం తెలియని జ్యోత్స్న తెగ కంగారు పడుతుంది. సుమిత్ర దగ్గర సింపతీ కొట్టేయడానికి.. “అమ్మో ఆపరేషన్ అంటే మమ్మీ స్కిన్ కట్ చేస్తారు కదా.. నాకు భయంగా ఉంది, బాధగా ఉంది” అంటూ జ్యోత్స్న డ్రామా మొదలుపెడుతుంది.

ఇది చూసిన కార్తీక్ ఆమెకు గట్టి కౌంటర్ ఇస్తాడు. “నీ ప్రేమ చూస్తుంటే ‘అమ్మ మీద ప్రేమ’ అని పెద్ద పుస్తకమే రాయాలనిపిస్తోంది. నీలో నవరసాలు అద్భుతంగా పండుతున్నాయి. నీ ప్రేమలో ‘కరుణ రసం’ మామూలుగా లేదు” అంటూ కార్తీక్ వెటకారంగా చప్పట్లు కొట్టడం హైలైట్‌గా నిలిచింది. దీంతో జ్యోత్స్న ముఖం మాడిపోతుంది.

Karthika Deepam 2 February 12th 2026 Episode : దీప త్యాగానికి డాక్టర్ హ్యాట్సాఫ్

జ్యోత్స్న తమ మనవరాలు కాదన్న నిజం తెలిసినా, సుమిత్ర ఆరోగ్యం కోసం ఆ నిజాన్ని దాచిపెట్టినందుకు డాక్టర్ హారిక.. కార్తీక్, దీపలకు థ్యాంక్స్ చెబుతుంది. “మీరు చేస్తున్న త్యాగం ముందు నేను చేసింది చాలా చిన్నది. తల్లిని కాపాడుకోవడంలో దీపకు ఎలాంటి సాయమైనా చేస్తాను” అని హారిక మాట ఇస్తుంది. మరోవైపు పారిజాతం మాత్రం తన మనవరాలిని మార్చేసిన సైదులు మీద పగతో రగిలిపోతూ ఉంటుంది.

డ్రైవర్‌గా కాశీ ఎంట్రీ.. స్వప్న సీరియస్

ఉదయాన్నే గుడికి వెళ్లేందుకు శ్రీధర్, స్వప్న, కావేరి సిద్ధమవుతుండగా.. కారు డ్రైవ్ చేయడానికి కాశీ వస్తాడు. అతన్ని చూడగానే స్వప్న మండిపడుతుంది. “వీడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు?” అని గొడవకు దిగుతుంది. అయితే శ్రీధర్ మాత్రం “ఇకపై కాశీ మన ఇంట్లోనే ఉంటాడు. డ్రైవర్‌గా, ఇంట్లో మనిషిగా అన్ని పనులు చేస్తాడు. అతనికి జీతం కూడా ఇస్తాను” అని తేల్చి చెబుతాడు. దీంతో స్వప్న కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

అమ్మవారు నువ్వే.. సుమిత్ర ఎమోషనల్

తన కూతురు తనతోనే ఉందన్న ఆనందంలో ఉన్న సుమిత్ర.. జ్యోత్స్నను చూసి మురిసిపోతుంది. “నా కూతురి పెళ్లి చూస్తానన్న నమ్మకం నాకుంది. రోజూ ఉదయం నిద్ర లేవగానే నేను అమ్మవారి ఫోటో చూడను, నా కూతురు ముఖమే చూస్తాను. ఈ రోజు నుంచి నా కూతురే నాకు అమ్మవారు” అంటూ సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. కానీ అసలు కూతురు జ్యోత్స్న కాదు, దీప అని తెలిస్తే సుమిత్ర గుండె తట్టుకోగలదా అనేది ఉత్కంఠగా మారింది.

మొత్తానికి జ్యోత్స్న భయం, కార్తీక్ వెటకారం, కాశీ ఎంట్రీతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మరి రేపటి ఎపిసోడ్ లో పారిజాతం కొత్త ప్లాన్ ఏంటి? స్వప్న ఏం చేయబోతోంది? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది