Zodiac Signs : ఫిబ్రవరి 12 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Devotional Desk | The Telugu News | Updated on : 11 February 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఉంటుంది ఈరోజు. బంధువులతో, స్నేహితులతో వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు. అనవసర ఖర్చులు వస్తాయి. ఆర్థిక మందగమనం. అన్ని రంగాల వారికి కొంచెం శ్రమ పెరుగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం చదువుకోండి మంచి జరుగుతుంది. వృషభరాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. పెద్దల ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థికంగా పురోగతి, వ్యాపారాలు మంచిగా ఉంటాయి. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. అనుకోని చోట నుంచి ఆదాయాలు పెరుగుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. ఆఫీస్‌లో పని భారం పెరుగుతుంది. కుటుంబంలో మార్పులకు అవకాశం కనిపిస్తుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : విజయాలకు నెలవైన రోజు. కుటుంబలలో వ్యవహారాల్లో అనుకూలమైన రోజు. విందులు, వినోదాలకు హాజరవుతారు. వ్యాపారాలలో ఆటంకాలతో మొదలైనా చివరికి లాభాల బాటలో నడుస్తాయి. శ్రీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope february 12 2022 check your zodiac signs

Today Horoscope february 12 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థిక వెసలుబాటు కలుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మెడికల్‌, ఐటీ, రియల్‌ రంగంలో వారికి లాభాలు. మహిళలకు ధనలాభం. శ్రీఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది ఈరోజు. పనులు నెమ్మదిస్తాయి. ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక మందగమనం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. మహిళలకు చికాకులు. హనుమాన్‌ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

తులారాశి ఫలాలు : పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి. అనుకోని ఆటంకాలతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక విషయాలు చికాకు తెప్పిస్తాయి. కుటుంబంలో మార్పులు. శ్రీ లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్రం వినడం లేదా చదవడం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో ఆనందంగా ముందుకుపోతారు. ఆర్థిక విషయాలలో ఉత్సాహం పెరుగుతుంది. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహిళలక సంతోషం. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : చాలా కాలంగా ఉన్న సమస్యలక పరిష్కారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. బంధవుల నుంచి శుభవార్తలు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఓపికతో, సమయమనంతో ముందుకు పోవాల్సిన రోజు. ఆర్థిక మందగమనం. అప్పులకోసం ప్రయత్నిస్తారు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఇంటా బయటా సమస్యలకు అవకాశం. హనుమాన్‌ దేవాలయంలో ప్రదక్షణలు, చాలీసా పారాయణం చేయండి.

కుంభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్తితులు చికాకులను తెస్తాయి. వ్యాపార లావాదేవీలు చేసేటప్పడు జాగ్రత్త. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో వివాదాలకు అవకాశం. ఇష్టమైన వారి నుంచి చెడు వార్తలు. శ్రీ శివాభిషేకం, శివారాధన చేయండి మంచి జరుగుతుంది.

మీనరాశి ఫలాలు : ఉల్లాసంగా గడుపుతారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలలో సంతృప్తి, వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. మీరు చేసే పనుల్లో పురోగతి. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు. మహిళలకు వస్త్రలాభం. ఇష్టదేవతారాధన చేయండి.

Devotional Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి