Zodiac Signs : ఫిబ్రవరి 20 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Devotional Desk | The Telugu News | Updated on : 19 February 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : ధనలాభాలతో సంతోషం. అప్పులు తీరుస్తారు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మహిళలకు అరోగ్యం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచిరోజు. కుటుంబంలో సంతోషం. ఆఫీస్‌లో పనులను వేగంగా పూర్తిచేస్తారు. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాలలో పురోగతి. వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. అన్ని రంగాలు, వృత్తుల వారికి సానుకూలమైన ఫలితాలు.

మిథునరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ధననష్టంతో ఇబ్బందులు. అనవసర ఖర్చులు వస్తాయి. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. పాలు, కూరగాయల వ్యాపారులకు లాభాలు. మహిళలకు చికాకులు వస్తాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ధైర్యంతో పనులు చేయాల్సిన రోజు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు కాదు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. పనులను నెమ్మదిగా సాగుతాయి. కుటుంబంలో సమస్యలు. మహిళళకు క్లిష్టపరిస్థితులు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

Today Horoscope february 20 2022 check your zodiac signs

Today Horoscope february 20 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. అనుకోని నష్టాలు వస్తాయి. రియల్‌, షేర్‌ పెట్టుబడులకు ఈరోజు దూరంగా ఉండండి. ఇంట్లో, బయటా అనుకోని మార్పులు జరుగుతాయి. మహిళలకు సంతోషమైన రోజు. అమ్మవారి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. అనారోగ్య సమస్యలు వస్తాయి. అనవసర వివాదాలు వచ్చే అవకాశం. మిత్రులతో విభేదాలు. ధనం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. అనవసర ఆందోళనలతో విద్యార్థులు, ఉద్యోగులు బాధపడుతారు. మహిళలకు చికాకులు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : అనుకోని భయాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల వల్ల చికాకులు. ఐటీ, రియల్‌, ఫార్మ వ్యాపారులకు లాభాలు. కుటుంబంలో అనుకోని మార్పులు. మహిళలకు సామాన్యంగా ఉంటుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. పనులను ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యవసాయం, పాలు, ఆహార సంబంధ వ్యాపారులకు లాభాలు వస్తాయి. మహిళలకు పనిభారం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనస్సురాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో ఈరోజు సంతోషంగా గడుస్తుంది. అదాయం పెరుగుతుంది. అనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. అతిథుల రాకతో సందడిగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం. ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : మీకు ఈరోజు కొంచెం మంచి, కొంచెం చెడు ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లాభాలు వస్తాయి. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. రియల్‌, ట్రేడింగ్‌ వారికి శుభ సమయం. విదేశీ ప్రయాణాలు, విద్య కోసం ఎదురుచూస్తున్నవారికి అనుకూలం. కుటుంబంలో వివాదాలకు అవకాశం. మహిళలకు ఆర్తిక ఇబ్బందులు. ఇంట్లో వారికి అనారోగ్య సూచన. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం, సూర్యనమస్కారాలు చేయండి.

కుంభరాశి ఫలాలు : మీరు చేసే పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఉత్సాహంగా ఈ రోజు గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. ప్రయాణంలో ఆనందం. విజయాలు సాధిస్తారు. శివారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అశాజనకంగా ఉండదు. వ్యాపార లావాదేవీలు ఇబ్బంది పెడుతాయి. మహిళలకు చికాకులు. కుటుంబంలో ఒకరికి అనారోగ్య సూచన. అనవసర వివాదాలక అవకాశం. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం. ఓం నమో భగవతే వాసుదేవాయనమః అనే నామాన్ని ప్రాతఃకాలం, సాయంత్రం కనీసం వందసార్లు జపించండి.

Advertisement

Devotional Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి