After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : అనుకున్న విధంగా ఈ రోజు పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులు బాగా శ్రమిస్తేనే విజయం మీకు సొంతం అవుతుంది. మహిళలకు ధనలాభ సూచన. ఇష్టదేవతరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : సంతోషం నిండిన రోజు. ఆర్థిక వనరులు పెరుగుతాయి. అప్పుల బాధలు తీరుతాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తి చేయగలగుతారు. ఇంటా, బయటా అనకూలమైన వాతావరణం. అనవసర విషయాలలో మాత్రం తలదూర్చకండి. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు వస్తాయి. ఎవరికి అప్పులు ఇవ్వకండి, తీసుకోకండి ఈరోజు. స్త్రీల వల్ల పురుషులకు, పురుషుల వల్ల స్త్రీలకు ఇబ్బందులు రావచ్చు. అనవసర ప్రయాణాలు చేస్తారు. శ్రమ పెరుగుతుంది. సాయంత్రం నుంచి కొంత ఊరట కలిగే వార్తలు వింటారు. ఓం గం గణపతయేనమః అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. కర్కాటకరాశి ఫలాలు : పనులను నెమ్మదిగా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. మిత్రుల ద్వారా లాభాలను పొందుతారు. ఆఫీస్‌లో మీకు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. మహిళలకు శుభఫలితాలు. శ్రీ లలితాదేవి ఆరాధన, సహస్రనామాలను వినడం,చదవడం చేయండి.
Today Horoscope february 24 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : మీరు చేసే పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చికాకులు,సమస్యలు తీరుతాయి. పక్కనున్న వారి నుంచి శుభవార్తలు వింటారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మహిళలకు శుభంగా ఉంటుంది. కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో వివాదాలకు అవకాశం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు స్వర్ణలాభాలు కనిపిస్తున్నాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : చక్కటి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా మంచిగా ఉంటుంది. పనిలో గుర్తింపు వస్తుంది. దూరపు ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచన. అన్ని రకాల వృత్తుల వారికి బాగుంటుంది. వివాహం కాని వారికి ప్రయత్నిస్తే సంబంధాలు కలుస్తాయి.
వృశ్చికరాశి ఫలాలు : కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ముందుకుపోతారు. ఆర్థిక విషయాలలో పెద్దలు, స్నేహితుల సహకారం లభిస్తుంది. అప్పులు తీరుస్తారు. పాలు, కూరగాయలు, చిల్లర, ఫార్మ, హోటల్ వ్యాపారులకు లాభాలు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.
ధనస్సురాశి ఫలాలు : అన్ని రంగాల వారికి సానుకూలమైన రోజు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మీకు ఈరోజు లాభదాయకమైన ఫలితాలు అందుతాయి. పెద్దల పరిచయాలతో ముందుకుపోతారు. మహిళలకు వస్త్ర లాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణం పొద్దున పూట కనిపిస్తుంది. ముఖ్య విషయాలు, పనులు ఈరోజు ప్రారంభించకండి. ఆర్థికంగా ఇబ్బంది. సమస్యలు రావచ్చు. ప్రయాణ చికాకులు. అనారోగ్య సూచన. మహిళలకు పని బారం పెరుగుంతుంది. శ్రీ గురుగ్రహారాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.
కుంభరాశి ఫలాలు : మీరు చేసే పనులను వేగంగా, ఉత్సాహంగా పూర్తిచేస్తారు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. చెడు విషయాలకు దూరంగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఎవరి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోకండి. మహిళలకు చికాకులు. శ్రీ హేరంబ గణపతిని ఆరాధించండి.
మీనరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరుగతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అనుకోని నష్టాలు వస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు వస్తాయి. సాయంత్రం నుంచి మీకు శుభ ఫలితాలు వస్తాయి. ఇంట్లో వారితో సఖ్యతగా ఉండండి. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీకృష్ణారాధన చేయండి.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.