Today horoscope : అక్టోబ‌ర్ 06 2021 బుధవారం మీ రాశిఫ‌లాలు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today horoscope : అక్టోబ‌ర్ 06 2021 బుధవారం మీ రాశిఫ‌లాలు..

 Authored By keshava | The Telugu News | Updated on :6 October 2021,6:40 am

మేష రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఇంట్లో సభ్యులు, ఆఫీస్‌లో సహోద్యోగులు మీ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు శ్రమించాల్సిన సమయం. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. రుణప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబంలో సాధారణ పరిస్థితులు, బోర్‌ కొట్టే విధంగా ఉంటుంది. ఏదైనా ప్రత్యేకం కోసం ప్రయత్నించండి. వాదనలకు దూరంగా ఉండండి. ఈరోజు అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షణలు చేయండి. లేదా విష్ణు సహస్రనామాలను వినండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. యోగా, ధ్యానం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అనవసర పెట్టుబడులు పెట్టకండి. మీ చుట్టూ ఉన్నవారు మీకు కోపం తెప్పించే అవకాశం ఉంది. కానీ సంయమనంతో వ్యవహరించండి. అనవసర పనులకోసము మీరు సమయాన్ని వృధాచేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి సహయాన్ని నిరాకరిస్తారు. స్నేహితుల వల్ల ఇబ్బందులు రావచ్చు. శ్రీరామ రక్షా స్తోత్రం చదవండి.

today horoscope in telugu

today horoscope in telugu

మిథున రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త్. జంక్‌ ఫుడ్‌ జోలికి పోకండి. ధనలాభాలు రావచ్చు. అనుకోని మార్గాల ద్వారా ధనం అందుతుంది. పొదుపు చేయడానికి ఈ రోజు చక్కటి రోజు. రియల్‌ ఎస్టేట్‌ వారికి అనుకూలం. దేవాలయ దర్శనం లేదా క్షేత్రాలను సందర్శించడం చేస్తారు. దీనివలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందుల తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మంచి రోజు. పేదలకు దానాలను చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు మానసిక భయం, ఇబ్బందులు రావచ్చు. కానీ వాటిని ధైర్యంగా ఎదురుకోండి. ఆర్థిక స్థితి మంచిగా ఉంటుంది. సురక్షితమైన పెట్టుబడులు పెట్టండి. సమయాన్ని వృథా చేసుకోకండి. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విందులకు, వినోదాలకు హాజరు అవుతారు. కార్యాలయాల్లో ఉద్యోగులకు ఇబ్బందులు రావచ్చు ఓపికతో ఉండండి. మీ సహుద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఆనందాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తుంది. గ్రీన్‌ కలర్‌ దుస్తులు ధరించండి. లేదా చెట్టకు నీరుపోయండి.

సింహ రాశి ఫలాలు : ఈరోజు సమయపాలన చేయలేకపోతారు. ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆరోగ్య సమస్యలు రావచ్చు. విశ్రాంతి తీసుకోండి. గతంలో పెట్టుబడిపెట్టిన పెట్టుబడులు లాభాలు రావచ్చు. ధనలాభాలు కలగడం వల్ల సంతోషం. పిల్లల వల్ల సమాజంలో మీకు గౌరవం కలుగుతుంది. స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఈ రోజు మీ జీవితంలో వసంతం వంటిది. దుర్గాదేవి ఆరాధన చేయండి. కన్యా రాశి ఫలాలు : ఈరోజు మీ మిత్రుల ప్రవర్తన వల్ల ఇబ్బందులు రావచ్చు. గతంలో మీరు చేసిన అప్పులు తీర్చాల్సిన రోజు. అప్పులు తీర్చే శక్తి మీకు వస్తుంది. ధనలాభాలు. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఇది సరైన రోజు. కష్టపడ్డవారికి లాభాలు. వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. చాలా కాలం తర్వాత మీకు మనశ్శాంతి లభిస్తుంది. పిల్లల వల్ల ఆనందం. ఈరోజు పేదలకు ఆహార పదార్థాలను దానం చేయండి.

Daily horoscope in telugu

Daily horoscope in telugu

తులా రాశి ఫలాలు : ఈరోజు మీ తెలివితేటలతో ముందుకు వెళ్తారు. ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తారు. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. వ్యాపారులకు శ్రమతో మంచి లాభాలు రావచ్చు. విద్యార్థులు వారి లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. ప్రేమ జీవితం ఈరోజు మెరుగైన మలుపు తీసుకుంటుంది. ఉద్యోగస్తులు ఈరోజు పుకార్లకు, వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు కారణము లేకుండా ఇతరులతో మీరు వాగ్విదానికి దిగుతారు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి చాలా మంచి రోజు. సంతోషం, ఆనందంగా గడుపుతారు. కాలభైరవాష్టకం వినండి లేదా చదవండి మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో చికాకులు, సమస్యలు రావచ్చు. కానీ మీరు నిగ్రహం కోల్పోవద్దు. మీ పిల్లల వల్ల లేదా సంతానం వల్ల ఆర్ధికప్రయోజనాలను పొందుతారు. ఇది మీ ఆనందానికి కారణము అవుతుంది. కుటుంబంలో చిత్రవిచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. మీ ఊహకు అందని విధంగా ఈరోజు గడుస్తుంది. భాగస్వామ్య పెట్టుబడులు అనుకూలం.ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్త. ప్రశాంతత లభిస్తుంది. శివ ఆరాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు గతాన్ని తల్చుకుంటూ నిరాశలోకి పోకండి. ధైర్యంతో ముందుకు పోవాల్సిన సమయం ఇది. అవసరమైనంత విశ్రాంతి తీసుకోండి. ఈరోజు మీరు ఆర్థికపరమైన సమస్యలను ఎదురుకుంటారు, అయినప్పటికీ మీరు మీ తెలివితేటలతో నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు. కుటుంబ సభ్యులతో ప్రేమతో వ్యవహరించండి. కోపతాపాలకు దూరంగా ఉండండి.పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. ఉమ్మడి వ్యాపారాలకు సరైన రోజు ఇది. ఈరోజు ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. జీవిత భాగస్వామితో చాలారోజుల తర్వాత ప్రశాంతంగా గడుపుతారు. శివుడికి మారేడు దళాలతో అర్చన చేయండి. మకర రాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో లాభాలు. చక్కటి మధుర క్షణాలు. మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. ఆఫీసులో ఈ రోజు మీదే రాజ్యం. ప్రయాణం వాయిదా పడతుంది. పిల్లల వల్ల ఆనందం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలూ చాలా ఆనందంగా గడుస్తాయి. విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

Daily horoscope in telugu

Daily horoscope in telugu

కుంభ రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్య విషయాలు జాగ్రత్త. ఆర్థిక లాభాలు కలుగుతాయి. పాత బకాయిలు వసూలు అవుతాయి. రుణాలు తీరుస్తారు. మీ చొరవతో బంధుత్వాలను మెరుగుపరుస్తాయి. ఆఫీస్‌లో మీరు తెలివితో లాభాలు సాధిస్తారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఇష్టదేవతరాధన చేయండి. మీన రాశి ఫలాలు: ఈరోజు చికాకులు, ఇబ్బందులు రావచ్చు. మీ సంతానం వల్ల ఇబ్బందులు. కోపాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. మీ ఆశలు నెరవేరుతాయి. మీకు పెద్దల ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి. గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు లభిస్తుంది. కుటుంబ వాతావరణం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు. పెద్దల ఆరోగ్య జాగ్రత్త. అతిథి రాకతో ఆనందం, వైవాహిక జీవితం సంతోషమయంగా ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది