Today horoscope : అక్టోబ‌ర్ 12 2021 మంగళవారం మీ రాశిఫ‌లాలు

Authored By Devotional Desk | The Telugu News | Updated on: October 12, 2021, 8:02 pm

today horoscope మేషరాశి : ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్ధికసమస్యలు పెరుగుతాయి. సవాళ్ళను ఎదుర్కొంటారు. ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి. వృషభ రాశి : ఈరోజు ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సాధారణ స్థితి ఉంటుంది. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలను పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

మిధున రాశి : ఈరోజు మిశ్రమఫలితాలు వస్తాయి. గతంలో పోగొట్టుకున్న డబ్బుని తిరిగి పొందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. శ్రీ లక్ష్మీనారాయణ స్తో్త్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి : ఉద్యోగస్తులకు అధికారుల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మీ సహచరుల నుంచి మీకు సాయం అందుతుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి. కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

సింహరాశి : ఈరోజు శుభకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, బంధువులతో సంబంధబాంధవ్యాలు పెంచుకొని ఆనందంగా ఉంటారు. ఇంట బయటా సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు శ్రీ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి. కన్యారాశి : ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. ఉన్నత విద్యకు అవకాశాలు వస్తాయి. వైవాహికంగా బాగుంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి అవుతాయి. శ్రీగణపతి ఆరాధన చేయండి.

తులారాశి : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోరుకునే వారికి ఈరోజు విజయం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. గృహ కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి. వృశ్చికరాశి : ఈరోజు తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎవరినైనా నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.

ధనుస్సురాశి : ఈరోజు బాగుంటుంది. వైవాహికంగా బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. పని వాతావరణం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. లలితా చాలీసా పారాయణం చేసుకోండి.  మకరరాశి : ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. స్నేహితుల సహకారం లబిస్తుంది. వ్యాపారులకు లాభాలు. అందరినీ ఆకట్టుకుంటారు. దానధర్మాలు చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

కుంభరాశి :ఈరోజు తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు వస్తాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకుంది . మీనరాశి : ఈరోజు అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. గృహంలో సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులకు శ్రమించాల్సిన పరిస్థితి. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

Devotional Desk

No bio available for this author.

  1. "Karthika Pournami 365 Vattula : కార్తీక పౌర్ణమి 365 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారు?.. ఏ సమయంలో వెలిగిస్తే మంచిదంటే?"

  2. "Jagadish Reddy : తెలంగాణ నీటి హక్కుల కోసం వెళ్తే అరెస్టులా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఫైర్!"

  3. "Ration Card : బిగ్ న్యూస్‌.. వీరి రేషన్ కార్డులపై వేటు? కీల‌క నిర్ణ‌యం దిశ‌గా కేంద్రం..!"

  4. "India A vs Pakistan A : పాక్ చేతిలో భారత్ ఓటమి.. అభిషేక్ 70, టిలక్ 100.. అయినా ఫ్యాన్స్ ఫైర్..!"

  5. "Puvvada Ajay Kumar : ఖమ్మంలో 800 ఇళ్లు కూల్చి 300 ఇళ్లు కట్టిస్తామంటారా?.. రేవంత్‌పై పువ్వాడ ఫైర్..!"

  6. "Odisha Viral News : బ్యాంకుకు అక్క అస్తిపంజరం మోసుకుని 3.5 కిలోమీటర్లు నడిచాడు.. చివరకు లక్షాధికారిగా మారిన తమ్ముడు!"

  7. "Gunde Ninda Gudi Gantalu Today Episode : రోహిణి ప్లాన్‌కు మనోజ్ విలవిల.. సుమతి పెళ్లిపై బాలు సంచలన నిర్ణయం!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp