Today horoscope : అక్టోబ‌ర్ 23 2021 శ‌నివారం మీ రాశిఫ‌లాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today horoscope : అక్టోబ‌ర్ 23 2021 శ‌నివారం మీ రాశిఫ‌లాలు

 Authored By keshava | The Telugu News | Updated on :23 October 2021,6:00 am

మేష రాశి ఫలాలు : ఈరోజు మీ వ్యక్తిత్వం వల్ల కొత్త పరిచయాలు,స్నేహితులను పొందుతారు. కంటికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త. ప్రేమికులకు మంచి రోజు. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. కొత్త పనులు చేపట్టకండి. పెద్దల సలహాలతో ముందుకు పోవాల్సిన రోజు. విద్యార్థులకు మంచి ఫలితాలు. వైవాహికంగాసాధారణంగా ఉంటుంది. హనుమాన్‌ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు. ఆర్థిక ఇబ్బందులు. దగ్గరివారు లేదా సోదర, సోదరీలు ధనాన్ని అడుగవచ్చు. కానీ ఎవరికి అప్పులు మాత్రం ఇవ్వకండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవలసిన రోజు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉంటుంది. విద్యార్థులకు మామూలుగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

మిథున రాశి ఫలాలు : ఈరోజు కొత్త ఆలోచనలు చేస్తారు. అప్పులు చేయకండి. ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు ముఖ్య వ్యక్తులను కలుస్తారు. అప్పులు చేయకండి. అనవర వివాదాలకు దూరంగా ఉండండి. మంచి అనుకూలమైన రోజు. అతిచిన్న విషయాల గురించి ప్రేమికులు గొడువ పడవద్దు. విద్యార్థులకు మంచి ఫలితాలు. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆఫీస్‌లో మీరు శ్రమించడం వల్ల గుర్తింపు పొందుతారు. ఆర్థిక లాభాలు. ప్రేమలో చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. జీవిత భాగస్వామితో కలిసి ఆనందం పొందుతారు. విద్యార్థులకు బాగా కలసి వస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఈరోజు మీ సొంతం. దుర్గాదేవి ఆరాధన చేయండి.

సింహ రాశి ఫలాలు : ఈరోజు అనవసర ఖర్చులు పెట్టకండి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులకు లాభాలు రావచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల చదువు కోసం ఖర్చు చేప్తారు. ప్రేమికులకు ఆనందం మీ సొంతం. ఆఫీస్‌లో సృజనాత్మకత కోసం ప్రయత్నించండి. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఈరోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధనం తాజాగా ప్రవహిస్తుంది. ఈరోజు ఇంట్లో వారు అనారోగ్యము బారినపడే అవకాశము ఉన్నది. జీవిత భాగస్వామితో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల వైపు ఆలోచనలు చేస్తారు. విద్యార్థులకు మంచి రోజు. శ్రీ ఆంజనేయ స్వామి దండకాన్ని మూడుసార్లు పఠించండి.

today horoscope in telugu

today horoscope in telugu

తులా రాశి ఫలాలు :ఈరోజు మీకు పరీక్షలాగా ఉంటుంది. కానీ మీ తెలివి తేటలతో ముందుకు పోతారు. పొదువు చేసిన సొమ్ముతో లాభాలు గడిస్తారు. ఆఫీస్‌లో మీకు ప్రశంసలు రావచ్చు. ధనాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అనవసర విషయాలకు దూరంగా ఉండాల్సిన రోజు. విద్యార్థులకు శ్రమతో కూడిన రోజు. వైవాహికంగా బాగా ఉంటుంది. శ్రీరామ తారకాన్ని కనీసం 108 సార్లు జపించండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజ చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఖాళీ సమయాన్ని పనికి వచ్చే పని కోసం వినియోగిస్తే చాలు మీకు అన్ని లాభాలే. వ్యాపారాలు మందకొడిగా సాగినా సాయంత్రం కల్లా లాభాలు సాధిస్తారు. ప్రయాణులు కలసి వస్తాయి. ఆఫీస్‌లో చాలా ప్రశాంతంగా ఉంటారు. వైవాహిక జీవితానికి సంబంధించిన అనుకోని సర్‌ప్రైసజ్‌లు వస్తాయి. విద్యార్థులకు మంచి రోజు. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు అలసట, వత్తిడి నుంచి దూరంగా ఉంటారు. మానసిక ప్రశాంతతో గడుపుతారు. మీ దైనందిన జీవితానికి సంబంధించి మార్పులను ఈరోజు చేసుకునే అవకాశం ఉంది. ఎవరికి అప్పులు ఇవ్వకండి ఆఫీస్‌లో మాత్రం బాగా శ్రమించాల్సిన రోజు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఇబ్బందులు తప్పవు. ప్రేమికులకు అంత అనుకూలం కాదు. విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆంజనేయస్వామి సింధూర దారణ, ప్రదక్షణలు మంచి ఫలితాన్నిస్తాయి.

today horoscope in telugu

today horoscope in telugu

మకర రాశి ఫలాలు : ఈరోజు మీకు కచ్చితంగా అంటే కఠినంగా ఉండకండి. దీనివల్ల ముఖ్య స్నేహితులకు దూరం కావచ్చు. కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలు చర్చిస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ప్రేమికులు సానుకూలంగా, శాంతంగా ఉండాల్సిన రోజు. విద్యార్థులు అనుకున్న పనులు పూర్తిచేయలేక పోతారు. వైవాహికంగా పర్వాలేదు. శనిగ్రహానికి ప్రదక్షణలు, నల్ల వత్తితో దీపారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతంగా ఉంటేనే మీ పనులు పూర్తవుతాయి. దీనికోసం మౌనం, చిరునవ్వును చిందించండి. మీకు అందే ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో చర్చించకుండా పెట్టుబడులు పెట్టకండి. లేకపోతే భవిష్యత్‌లో నష్టాలు చూడాల్సి వస్తుంది. వైవాహికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. దక్షిణామూర్తి స్తోత్రం వినండి లేదా పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా గడుపుతారు. మిత్రులతో ఆనందంగా గడపటానికి బయటకు వెళ్తారు. పని వత్తిడి తగ్గుతుంది. ప్రేమికుల మధ్య బహుమతుల పంపిణీ జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధం కొనసాగుతుంది. వైవాహికంగా ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకుంటారు మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది