Today horoscope : అక్టోబ‌ర్ 26 2021 మంగళవారం మీ రాశిఫ‌లాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today horoscope : అక్టోబ‌ర్ 26 2021 మంగళవారం మీ రాశిఫ‌లాలు

 Authored By keshava | The Telugu News | Updated on :26 October 2021,6:15 am

మేషరాశి ఫలాలు : ఈరోజు చాలా బాగుంటుంది. ఆనందంగా ఈరోజును గడుపుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు, ఆనుకోని చోటు నుంచి లాభాలు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు. ఆఫీస్‌లో అనుకూల వాతావరణం. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. వైవాహికంగా సంతోషం మీ సొంతం. దుర్గాదేవి ఆరాధన చేయండి.  వృషభరాశి ఫలాలు : మంగళవారం మీకు ఆనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా మంచి స్థితి, ధన లాభం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆఫీస్‌లో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులకు సహకారం చేస్తారు. వైవాహికంగా బాగుంటుంది. అపరాజితాదేవి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల వాతావరణం కన్పిస్తుంది. గ్రహాల కదలిక వల్ల కొన్ని ఇబ్బందులు. పనులు పెండింగ్‌ పడుతాయి. అనవసర వివాదాలకు దూరంగాఉండండి.ఆఫీస్లో మీ పని మీరు చేసుకోండి.వ్యాపారులకు ధననష్టాన్ని సూచిస్తుంది. ఎవరికి అప్పులు ఇవ్వకండి. విద్యార్థులు బాగా శ్రమిస్తేనే ఫలితం. అమ్మవారి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. పనులను వేగంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ఆఫీస్లో మంచి వార్తలు వింటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వైవాహికంగా సంబురంగా గడుపుతారు. విద్యార్తులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదేవతారాధన చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

సింహరాశి ఫలాలు : ఈరోజు బాగుంటుంది. పెద్దల నుంచి సహకారం లభిస్తుంది. భార్య లేదా అత్తమామల తరుపు వారి నుంచి ఆర్థిక లాభాలు వస్తాయి. మంచి ఆలోచనలతో పనులు ప్రారంభిస్తారు. కుటుంబ నుంచి పూర్తి సహకారం పొందుతారు. వైవాహికంగా ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు అనుకోని శుభవార్తలు వింటారు,. శ్రీరామ జపం చేయండి.

కన్యారాశి ఫలాలు : అరోజు ప్రతికూల వాతావరణం. అనుకోని నష్టాలు రావచ్చు. ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహిరించండి. అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకండి. కోపతాపాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. విద్యార్థులు జాగ్రత్తగా మసులు కోవాలి. శ్రీ సుబ్రమణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం కొరవడుతుంది. ఆఫీస్‌లో అనుకూలమైన బదిలీ జరుగుతుంది. వైవాహికంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకోని ఖర్చులు.విద్యా ర్థులకు మమూలుగా ఉంటుంది. నవగ్రహాలలో కుజుడు వద్ద దీపారాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు శుభం, అశుభ ఫలితాలు కలసి ఉంటాయి. అనుకోని ఇబ్బందులు రావచ్చు కానీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. విదేశీ ప్రయాణం లేదా విద్యాకు సంబంధించిన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండండి.వైవాహికంగా మామూలుగా ఉంటుంది. శ్రీ దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు సందర్బోచితంగా ప్రవర్తిస్తారు. అన్నింటా సంతోషం కన్పిస్తుంది.
ఆఫ్స్‌లో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో ఆనందం. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆఫీస్‌లో మాత్రం జాగ్రత్తగా మసులుకోండి, విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాల్సిన రోజు. శ్రీ కాళికాదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు: ఈరోజు అన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో చిన్నిచిన్న సమస్యలు వచ్చినా వాటిని అధిగమిస్తారు. పిల్లలతో జాగ్రత్త. ఆఫీస్‌లో మంచి పలితాలు వస్తాయి. వివాహం అయిన వారికి అనుకోని ఖర్చులు, వ్యాపారాలు బాగుంటాయి. నవగ్రహాలకు 16 ప్రదక్షణలు చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు అనుకోని బాధలు రావచ్చు జాగ్రత్త. దైవ చింతన మిముల్ని కాపాడుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆఫీస్‌లో స్థాన చలనం అదీ మీ మంచికే. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. వైవాహికంగా సంతోషం, విద్యార్థులకు మంచిరోజు.ఈరోజు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షణలు, పూజ చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు విజయం తథ్యం. అనుకోని చోట నుంచి లాభాలు రావచ్చు. కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు,. ప్రయాణాలు కలసి వస్తాయి. కుటుంబంలో సంతోషం. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. అమ్మవారి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది