Zodiac Signs : జనవరి 01 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 31 December 2021, 10:40 pm

Zodiac Signs మేషరాశి ఫలాలు : శుభకరమైన రోజు. సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువులు, పెద్దల నుంచి మంచి సహాకారం లభిస్తుంది. కుటుంబంలో పండుగ వాతావరణం. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు మంచి ప్రోత్సాహకరమైన రోజు. మహిళలకు వస్త్ర లాభం. శ్రీలక్ష్మీదేవి స్తోత్రం చదువండి. వృషభరాశి ఫలాలు : చేస్తున్న పనులు పూర్తిచేస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా సంతోషం నిండిన రోజు. మహిళలకు మంచి వార్తలు తెలుస్తాయి.

మిధునరాశి ఫలాలు : కొంచెం ఇబ్బందులు, పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకున్నంతగా ఉండదు. వ్యాపారాలు మామూలుగా ఉంటాయి. కుంటుంబ వ్యవహారాలు ముందుకు సాగవు. మహిళలకు బాధ్యతలు పెరుగుతాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక విషయాల్లో సామాన్యంగా ఉంటాయి. పనులు ఆటంకాలతో సాగుతాయి. బయటా పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

సింహరాశి ఫలాలు : అన్ని పనులు పూర్తిచేస్తారు. చాలా కాలంగా వసూలు కాని బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంలో కీలక నిర్ణయాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. మమహిళలకు పనిఒత్తిడులు తొలగుతాయి. శుభ ఫలితాల కోసం శ్రీ రామ జయరామ జయజయ రామ అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి.

కన్యారాశి ఫలాలు : ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటంబ సభ్యుల ద్వారా శుభవార్తలు వింటారు. చాలా కాలంగా ఉన్న వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధన లాభాలు. పనులు ఉత్సాహవంతంగా సాగుతాయి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ విష్ణు సహస్రనామా పారాయణం చేయండి.

today horoscope january 01 2022 check your zodiac signs

today horoscope january 01 2022 check your zodiac signs

తులారాశి ఫలాలు : కొంత ప్రతికూలత కనిపిస్తుంది. ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు పని భారం పెరుగుతుంది. అనారోగ్య సూచన కనిపిస్తుంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విద్యార్థులకు, ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. అవాంతరాలు. శ్రీకృష్ణాష్టకం చదువుకోండి.

వృశ్చికరాశి ఫలాలు : కుటుంబంలో సమస్యలు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో మందగమనం. వ్యాపారాలలో ఇబ్బందులు. మహిళలకు చికాకులు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. ఆస్తి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆర్థికంగా మంచి రోజు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల ద్వారా సహకారంతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అరోగ్యం బాగుంటుంది. అనుకోని ప్రయాణాలు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. పని భారం బాగా పెరుగుతుంది. కుటుంబసమస్యలు. ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు. మహిళలకు మాటపట్టింపులు. విద్యార్థులకు బాగా కష్టించాల్సిన రోజు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : అనుకోని ధనలాభం. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. పెద్దల నుంచి మంచి వార్తలు అందుతాయి. కుటుంబంలో అనుకోని మార్పులు. శ్రమ తగ్గుతుంది. సంతోషం, ఆనందం మీకు ఈ రోజు సొంతం. కార్యసిద్ధి. వస్తులాభాలు. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు: అనుకోని ఇబ్బందులు. కుటుంబంలో వివాదాలు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు శ్రమ. ఆర్థిక సమస్యలు. అప్పులు చేస్తారు. ప్రయాణాలు చేసి ఇబ్బంది పడుతారు. మహిళలకు బాగా శ్రమతో కూడిన రోజు. శ్రీలక్ష్మీ, నారాయణ ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి