Zodiac Signs : జనవరి 08 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : జనవరి 08 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

 Authored By prabhas | The Telugu News | Updated on :7 January 2023,10:40 pm

మేష రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ఇబ్బందులు రావచ్చు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వివాదాలు వచ్చే అవకాశం ఉంది. చేసే పనులలో ఇబ్బందులు.పెద్లల సహాయంతో సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు. మహిళలకు ఇబ్బందులు వస్తాయి. పనిభారం పెరుగుతుంద. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : చక్కటి రోజు. ఆదాయంలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఉత్సాహంగా ఈరోజు గడిచిపోతుంది. వ్యాపారాలలో లాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చేసే పనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహిళలకు ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. ఓం మిత్రాయనమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.

మిథున రాశి ఫలాలు : ఆనందంగా గడుపుతారు ఈరోజు. ప్రయాణాలలో లాభాలు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాయంత్రం మీరు దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పాత బాకీలను వసూలు అవుతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయనమః అనే మంత్రాన్ని జపించండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు వస్తాయి కానీ కుటుంబ సభ్యుల సహకారంతో వాటిని పరిష్కారించుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త వహించాలి. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మహిళలకు ఆర్థికంగా లాభాలు వస్తాయి,. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope January 08 2023 Check Your Zodiac Signs

Today Horoscope January 08 2023 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అనుకోని ఆటంకాలతో ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. చేసే పనులలో ఆటంకాలు. కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. విలువలైన వస్తవులు జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. అప్పుల కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. శ్రీ దుర్గా సరస్వతి ఆరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : మధ్యస్తంగా ఇబ్బందులు వస్తాయి. ఆనుకోని విధంగా ఈరోజు గడిచిపోతుంది. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. శ్రమతో కూడిన రోజు. వివాహ ప్రయత్నాలకు అంత అనుకూలం కాదు. పాత బాకీలు వసూలు కావు. చికాకులు పెరుగుతాయి. సాయంత్రం నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. శుభవార్తలు వింటారు. మహిళలకు దూర ప్రాంతం నుంచి మంచి వార్తలు వింటారు. శ్రీ నారాయణ మంత్రాన్ని ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. ఆనుకోని ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. ఆఫీస్‌లో మీకు పని భారం పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమతో కూడిన రోజు. వ్యాపారాలలో నష్టాలు. అనుకోని ఖర్చులు వస్తాయి. మహిళలకు ఇబ్బందులు. దూర ప్రయాణ సూచన. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. అప్పులు తీరుస్తారు. సమాజంలో మీకు మంచి పేరు, ప్రఖ్యాతలు వస్తాయి. మహిళలకు శుభవార్తలు. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో కూడిన రోజు. పెద్దల సలహాలు పాటించకుండా మీరు నష్టపోతారు. వ్యసనాలకు ఈరోజు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు వస్తాయి. మహిళలకు ఇబ్బందులు వస్తాయి. బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. పనులతో బిజీ బిజీగా ఉంటారు. ఆనుకోని ప్రయాణాలు రావచ్చు. శ్రీ శివారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు ఓపికతో ముందుకుపోవాల్సిన రోజు. అనుకోని చికాకులు వస్తాయి. ఆటంకాలతో చేసే పనులలో ఇబ్బందులు వస్తాయి. ధన సంబంధ విషయాలలో నష్టాలు వస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇబ్బంది వస్తుంది. వాహన ప్రయాణాలలో ఇబ్బందులు వస్తాయి. వ్యయప్రయాసలతో కూడిన రోజు. మహిళలకు ఇబ్బందులు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

కుంభ రాశి ఫలాలు : మంచి, చెడులతో కూడిన రోజు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. పెద్దల సహకారంతో ముందుకుపోతారు. మిత్రులతో కలసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రాంతం నుంచి చెడు వార్తలు వింటారు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. మహిళలకు శుభవార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.

మీన రాశి ఫలాలు ; ఈరోజు మీరు చక్కటి ఫలితాలను పొందుతారు. అన్ని రకాల వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. బంధువుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలసి శుభకార్యాలలో పాల్గొంటారు . ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది