Ustaad Bhagat Singh Public Talk : ఉస్తాద్ భగత్ సింగ్ పబ్లిక్ టాక్.. థియేటర్లలో పవర్ స్టార్ మాస్ జాతర.. ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ రివ్యూ ఇదే..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 March 2026,11:00 am

ప్రధానాంశాలు:

  •  Ustaad Bhagat Singh Public Talk : ఉస్తాద్ భగత్ సింగ్ పబ్లిక్ టాక్.. థియేటర్లలో పవర్ స్టార్ మాస్ జాతర.. ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ రివ్యూ ఇదే..!

Ustaad Bhagat Singh Public Talk : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan , Harish Shankar డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద అదొక సంచలనం. ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ Ustaad Bhagat Singh. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఉగాది పండుగ కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. టీజర్, గ్లింప్స్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఆర్. పర్తీబన్ విలన్‌గా మెప్పించగా.. గౌతమీ, అశుతోష్ రాణా, నవాబ్ షా, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ప్రీమియర్ షోల తర్వాత పబ్లిక్ టాక్ Ustaad Bhagat Singh Public Talk ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Ustaad Bhagat Singh Public Talk : ఉస్తాద్ భగత్ సింగ్ పబ్లిక్ టాక్.. థియేటర్లలో పవర్ స్టార్ మాస్ జాతర.. ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ రివ్యూ ఇదే

Ustaad Bhagat Singh Public Talk : ఉస్తాద్ భగత్ సింగ్ పబ్లిక్ టాక్.. థియేటర్లలో పవర్ స్టార్ మాస్ జాతర.. ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ రివ్యూ ఇదే

Ustaad Bhagat Singh Public Talk  ఓపెనింగ్ అదిరింది.. పవన్ ఎంట్రీకి పూనకాలే!

సినిమా ప్రారంభం నుంచే హరీష్ శంకర్ తన మార్క్ మాస్ టోన్‌ను సెట్ చేశారని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం లాంటి ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ సీన్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఇచ్చిన ఓపెనింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందట. ఆ తర్వాత నల్లమల అడవుల్లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్, హీరో చిన్ననాటి స్టోరీ సినిమా కథకు ఒక స్ట్రాంగ్ బేస్‌ను క్రియేట్ చేశాయి.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గబ్బర్ సింగ్ రిఫరెన్స్‌తో డిజైన్ చేసిన ఎంట్రీ సీన్‌కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా “భగవద్గీత… భగత్ గీత” అంటూ పవన్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ కు గూస్‌బంప్స్ ఖాయం అని ఆడియన్స్ అంటున్నారు.

ఫుల్ రివ్యూ ఇక్క‌డ చ‌ద‌వండి == > Ustaad Bhagat Singh Movie Review : ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Ustaad Bhagat Singh Public Talk : ఫస్ట్ హాఫ్: కామెడీ, రొమాన్స్, పక్కా కమర్షియల్

ఫస్ట్ హాఫ్ అంతా పవన్ కళ్యాణ్ స్వాగ్, హరీష్ శంకర్ మార్క్ కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫుల్ మీల్స్ లా సాగిపోతుందట. రాశీ ఖన్నా తన గ్లామర్‌తో పాటు పాత్రలోని ఎమోషన్‌ను కూడా అద్భుతంగా పండించిందని టాక్. అలాగే సత్యం రాజేష్ కామెడీ ట్రాక్ వర్కౌట్ అవ్వడం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. థియేటర్లలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్స్ రిఫరెన్సులు వచ్చినప్పుడు అభిమానుల విజిల్స్ తో సౌండ్ బాక్సులు బద్దలవ్వడం గ్యారెంటీ అని చెబుతున్నారు.

ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. పవన్ కళ్యాణ్, మెయిన్ విలన్ ఆర్. పర్తీబన్ మధ్య సెట్ చేసిన కాన్‌ఫ్లిక్ట్, దానికి తోడు ఇచ్చిన అదిరిపోయే ట్విస్ట్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. ఇక్కడి నుంచి సినిమా పీక్స్‌కి వెళ్తుందన్న ఫీలింగ్ కలుగుతుంది.

Ustaad Bhagat Singh Public Talk : సెకండాఫ్: ఎమోషన్, యాక్షన్, శ్రీలీల ట్రాక్

సెకండాఫ్‌లో సినిమా పూర్తిగా ఒక సీరియస్, యాక్షన్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల ఎంట్రీతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. పవన్, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్‌గా ఉండటమే కాకుండా, ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ అవుతాయట.

ముఖ్యంగా నిర్భయ తరహా ఘటనను గుర్తు చేసే ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ప్రతి ఒక్కరినీ కదిలించేలా దర్శకుడు హరీష్ శంకర్ తీర్చిదిద్దారు. ఇక లుంగీ ఫైట్, పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్, పవన్ కళ్యాణ్ చెప్పే పొలిటికల్ అండ్ మాస్ డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయని పబ్లిక్ టాక్. క్లైమాక్స్ రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా టెర్రరిస్ట్ బ్యాక్‌డ్రాప్, దేశభక్తి ఎలిమెంట్స్‌ను ముడిపెడుతూ ముగించడం సినిమాకు మరో హైలైట్.

Ustaad Bhagat Singh Public Talk : సంగీతం, సాంకేతిక వర్గం

ఈ సినిమాకు మరో హీరో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ BGM. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రాగా, ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ థియేటర్లలో దుమ్ములేపుతోంది. ఇక బీజీఎం బాధ్యతలు తీసుకున్న ఎస్. థమన్ ప్రతి ఎలివేషన్ సీన్‌ను తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఆయనంకా బోస్ సినిమాటోగ్రఫీ, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాను విజువల్ గా చాలా రిచ్ గా చూపించాయి. డ్యాన్స్ మూమెంట్స్ లో పవన్ వేసిన స్టెప్పులు ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ ట్రీట్.

ఫైనల్ టాక్ ఏంటంటే?

మొత్తంగా చెప్పాలంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. తన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ మొత్తం సినిమాను తన భుజాలపై మోశాయి. కొన్ని సీన్లు కాస్త రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో అనిపించినా, పవన్ మేనియా ముందు అవి పెద్దగా కనిపించవు. ఈ పాజిటివ్ పబ్లిక్ టాక్ తో ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తాడో వేచి చూడాలి.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి