Zodiac Signs : జనవరి 17 సోమవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషరాశి ఫలాలు : అనుకోని పనులతో బిజీగా ఉంటారు. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక విషయాలలో కొన్ని కష్టాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రీశివాభిషేకం చేయించుకోండి మంచి ఫలితాలు వస్తాయి. వృషభరాశి ఫలాలు : అనుకోని లాభాలు. ఆర్థిక అభివృద్ధి. చిల్లర, కిరాణం వ్యాపారులకు లాభాలు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటాబయటా ఉత్సాహంగా గడుపుతారు.సమాజంలో గౌరవం. అన్ని పనులలో అనుకూలత. శుభ ఫలితాల కొరకు శ్రీవిష్ణు సహస్ర నామాలను పారాయణం చేయండి.
మిధునరాశి ఫలాలు : శ్రమతో కూడిన రోజు. అనారోగ్య సూచన. బంధువులతో అనుకోని ఇబ్బందులు. వ్యాపారాలు సాదారణంగా ఉంటాయి. ఆర్థికంగా పర్వాలేదు. ఇంటా, బయటా అనుకోని సమస్యలు కానీ మీ తెలివిని ఉపయోగిస్తే బయటపడుతారు. మహిళలకు ఆనారోగ్యం. శ్రీ శివారాధన చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటకరాశి ఫలాలు : కొత్త ఉత్సాహం. పనులు వేగంగా పూర్తిచేస్తారు. ముఖ్య విషయాలు మిత్రుల ద్వారా తెలుస్తాయి. పెద్దల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు. వ్యాపార వృద్ధి. శుభ ఫలితాల కొరకు శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope january 17 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థికంగా మంచిరోజు. సకాలంలో పనులు చేస్తారు. ఇంటా, బయటా ప్రశంసలు అందుకుంటారు. మహిళలకు స్వర్ణ లాభాలు కనిపిస్తున్నాయి. పిల్లల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : అనుకోని నష్టాలు. ఖర్చులు పెరుగుతాయి. శ్రమ పెరుగుతుంది. ఇంటా, బయటా సమస్యలు రావచ్చు. కానీ పెద్దల సహకారంతో బయటపడుతారు. మహిళలకు వేరే వారికి మంచి చేద్దామని చేటు తెచ్చుకుంటారు. శ్రీదుర్గా అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కొంచెం ఇబ్బందికరమైన రోజు. పిల్లల ద్వారా సమస్యలు రావచ్చు. అనారోగ్య సూచన. ఆర్థిక కష్టాలు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. పరిస్థితులు నిరాశ పరుస్తాయి. శుభ ఫలితాల కోసం శ్రీశివకవచం వినండి లేదా చదువుకోండి.
వృశ్చికరాశి ఫలాలు : అనుకోని ఆర్థిక లాభాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం. పెద్దల ద్వారా ముఖ్య పనుల కోసం వ్యూహరచన చేస్తారు.యువకులకు, మహిళలకు శుభవార్తలు. శుభ ఫలితాల కోసం శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఆర్థికంగా మంచి రోజు.వ్యాపారాలు బాగుంటాయి.శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ధనలాభం. మహిళలకు వస్త్రలాభం. శుభ ఫలితాల కోసం శ్రీ శివ పంచాక్షరీ జపించండి.
మకరరాశి ఫలాలు : ఆటంకాలతో చికాకులు. ఆర్థిక విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. అప్పుల బాధలు. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మహిళలకు మాటపట్టింపులు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : పనులు చేయాలనుకుంటారు కానీ నత్తనడుకన సాగుతాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. ఆర్థిక మందగమనం. మహిళలకు పని భారం. శ్రీ శివాష్టోతరం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : మంచి రోజు. అనుకోని లాభాలు. మీకు మంచి గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. స్వర్ణ లాభాలు. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో పురోగతి. ఇష్టదేవతారాధన చేయండి.