Zodiac Signs : జనవరి 23 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 22, 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : మీకు పని భారం పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. అన్ని రకాల వ్యాపారులకు నిరాశజనకంగా ఉంటాయి. ఆదాయం తగ్గుతుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. మహిళలకు చికాకులు. శ్రీఆంజనేయస్వామి ఆరాధన, చాలీసా పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : ఆనుకోని ఇబ్బందులు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం విషయం జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. పని భారం పెరుగుతుంది. అన్ని వృత్తులు వారికి శ్రమ పెరుగుతుంది. మహిళలకు మానసిక అశాంతి. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయాలుపెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకూల ఫరిస్తితులు. వ్యాపారాలలో లాభాలు రావచ్చు. విద్యార్థులకు అనకూలం. మహిళలకు సంతోషకరమైన రోజు. రుద్రాభిషేకం చేయించుకోండి. కర్కాటకరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకూలమైన ఆర్థిక పరిస్తితి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. శ్రమకు తగ్గ ఫలితం రాదు. స్థాన చలనం. మాటపట్టింపులు. ఆరోగ్య భంగం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Today Horoscope january 23 2022 check your zodiac signs

Today Horoscope january 23 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : మంచి అవకాశాలు వస్తాయి. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పెద్దల పరిచయాలు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఆర్థికంగా వృద్ధి. మంచి గౌరవం. ఆహారం, ఆరోగ్యం. శ్రీ భాస్కరాయనమః అనే నామాన్ని కనీసం 108 సార్లు పఠించండి.

కన్యారాశి ఫలాలు : కొంచెం ఆటంకాలు. శారీరక బాధలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల నుంచి సమస్యలు రావచ్చు. ఆర్థిక మందగమనం. పని భారం పెరుగుతుంది. ఆందోళన, మానసిక అశాంతి. శ్రీ కామాక్షీ ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మంచి రోజు. సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా చక్కటి స్థితి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మీ ప్రయత్నాలు నెరవేరుతాయి. అన్నింటా విజయం. మహిళలకు శుభ వార్తలు. ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఆర్థికం పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో సంతోషం. కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. విద్యార్థులకు శుభ సమయం. నిరుద్యోగులకు మంచి వార్తలు. మహిళలకు లాభాదాయకమైన రోజు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : కుటుంబంలో నిరాశజనకమైన పరిస్థితులు. ఆదాయం తగ్గుతుంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పని భారం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం. మహిళలకు అనారోగ్య సమస్యలు రావచ్చు. విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు. ఆర్థిక మందగమనం. శారీరక బాధలు. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. అప్పులు ఎవరికి ఇవ్వద్దు. అనారోగ్య సమస్యలు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం రాదు. మహిళలకు వివాదాలు. శ్రీ లలితాదేవి సహస్రనామాలను చదువుకోండి లేదా వినండి.

కుంభం రాశి ఫలాలు : ఆర్థికంగా సంతోషకరమైన రోజు. మంచి ఆలోచనలు, తెలివితేటలతో ముందుకు పోతారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. మహిళలకు ఆనందం, మంచి వాతావరణం కలిగిన రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఉత్సాహంగా పనులు చేస్తారు. ఉల్లాసంగా మిత్రులతో గడుపుతారు. కుటుంబంలో శుభకార్య సూచన. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు విజయం. మహిళలకు ధనలాభాలు వస్తాయి. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp