Zodiac Signs : జూలై 17 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : జూలై 17 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :16 July 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : చక్కటి ఫలితాలను సాధిస్తారు. ఆనుకోని మార్గాల ద్వారా లాభాలను గడిస్తారు. ఆనందంగా ఈరోజు గడుస్తుంది. విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు వస్తాయి. సమాజం గురించిన ఆలోచనలు చేస్తారు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా లాభాలు గడిస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. ప్రయాణ సూచన. చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ఇతర విషయాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : విచిత్రమైన పరిస్థితులతో ఈరోజు గడుస్తుంది. అనుకున్నదాన్ని కాకుండా వేరే పనులు చేస్తారు. బంధువుల రాక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విద్య, ఉద్యోగ విషయాలలో చికాకులు పెరుగుతాయి. ఆర్థికంగ మామూలు పరిస్థితి. అమ్మవారి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : శుభ ఫలితాలను సాదిస్తారు. ఆనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విద్యా, వివాహ విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విహారయాత్రలకు ప్లాన్‌ చేసుకుంటారు. మహిళలకు లాభదాయమకైన రోజు. ఆదిత్య హృదయం పారాయణం చేయండి,

Today Horoscope July 17 2022 Check Your Zodiac Signs

Today Horoscope July 17 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : మామూలుగా సాగిపోతుంది ఈరోజు. అనుకున్న పనులను నిదానంగా పూర్తిచేస్తారు. విశ్రాంతి లభిస్తుంది. చాలా కాలం తర్వాత మిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. విందువినోదాలు. నూతన ఉద్యోగయోగం. మహిళలకు ఒత్తిడుల నుంచి విముక్తి. ఇష్టదేవతరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : చక్కటి శుభ ఫలతాలను సాధిస్తారు. అన్నింటా జయం కలుగుతుంది. ఆర్థికంగ పురోగతి కనిపిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల వల్ల లాభాలు వస్తాయి. అనుజ్ఞ గణపతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తి చేయలేరు. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ఇంటా, బయటా అనుకోని మార్పులు జరుగుతాయి. రుణాల కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. శ్రీ కాలభైరవారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అన్నింటా శుభ ఫలితాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. విలువైన వస్తువులను కొంటారు. అప్పులను తీరుస్తారు. మహిళలకు మంచి లాభదాయకమైన రోజు. శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపించండి.

ధనుస్సు రాశి ఫలాలు : చాలా కాలం తర్వాత విశ్రాంతి లభిస్తుంది. ఆన్నింటా ఆటంకాలు వస్తాయి, కానీ వాటిని ధైర్యంతో అధిగమిస్తారు. మంచి పనులు ప్రారంభిస్తారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మహిలలకు శుభవార్తలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారాలలో సానుకూలత తక్కువగా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. మహిళలకు చికాకలు. ఇష్టదేవతారాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది పడుతారు. ఆదాయం తగ్గుతుంది. చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. వివాదాల వల్ల ఇబ్బందులు. పని వత్తిడి పెరుగుతుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మంచి ఫలితాలను సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా జయం కలుగుతుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువులలో, వ్యాపారాలలో శుభకరంగా ఉంటుంది. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది