Zodiac Signs : జూలై 29 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : జూలై 29 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By aruna | The Telugu News | Updated on :28 July 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించాల్సిన రోజు. రిలాక్స్‌ కోసం యోగా లేదా మిత్రులతో గడపండి. ప్రేమికులకు అనుకూలం. ఆఫీస్‌లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు లాభాన్ని చేకూరుస్తాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. శ్రీ లక్ష్మీదేవవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు బాగా వత్తిడి ఉంటుంది. చికాకులు పెరుగుతాయి. పని పై ఏకాగ్రత పెట్టలేరు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రేమికులకు ఇబ్బందికరమైన రోజు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ సూక్తంతో అమ్మవారి ఆరాదన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు పాలు, కిరాణం, కూరగాయల వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. చాలాకాలంగా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు. ప్రేమికుల మధ్య మాటలు ఉండవు. కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. ప్రయాణ సూచన కనిపిస్తుంది. ఆర్థికంగా పర్వాలేదు. శ్రీ కనకదుర్గాదేవి ఆరా౪ధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో సంతోషంగా ఉంటారు. విశ్రాంతి తీసుకోవడానికి చక్కటి రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు అమలు చేయడానికి అనుకూలమైన రోజు. శ్రీ సూక్తంతో పారాయణం చయండి.

Today Horoscope July 29 2022 Check Your Zodiac Signs

Today Horoscope July 29 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అనుకోని ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన రోజు. పిల్లల సమస్యలు తీర్చడానికి ప్రయత్నిచండి. అభివృద్ధి కానవస్తోంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
ఇష్టదేవతరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఈరోజు తెలివితేటలతో ముందుకుపోవాల్సిన రోజు. ఆదాయం కోసం తీవ్రంగా కష్టపడాల్సిన రోజు. ఆర్థికంగా సాధారణ స్తితి. నిరుద్యోగులకు శ్రమించాల్సినరోజు. దూరప్రాంతం నుంచి అనుకోని కానుకలు, బహుమతులు అందుతాయి. ప్రేమికులకు మంచిరోజు. శ్రీ రామ తారకాన్ని జపించండి,

తులా రాశి ఫలాలు : ఈరోజు పరిస్థితులు అనకూలత తక్కువగా ఉంటుంది. ఓపిక, సహనం చాలా అవసరం. ఆవేశంతో ఈరోజు పనులను చేయకండి. ప్రేమికుల మధ్య ఈరోజు సంబంధాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. మాటలను అదుపులో పెట్టుకోవాల్సిన రోజు. శ్రీదుర్గాసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మంచి ఫలితాలను పొందుతారు. మీ ప్రవర్తన వల్ల ఇంట్లో, బయటా ప్రశంసలు పొందుతారు. ఈరోజు అప్పులు ఎవరికి ఇవ్వద్దు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అనుకూలమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో ఆలోచించి మాట్లాడండి. ఆదాయం పెరుగుతుంది. అందరినీ ఆకర్షిస్తారు. ప్రేమికులకు మంచి రోజు. ఆఫీస్‌లో ప్రశంసలు లభిస్తాయి. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : అనారోగ్య సూచన కనిపిస్తుంది. విజయాలను సాధిస్తారు. కొత్త ఆలోచనలను చేస్తారు. ధనలాభాలు వస్తాయి. అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అనుభవిస్తారు. ప్రేమికులకు మధ్య సఖ్యత పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. శ్రీ మాత్రేనమః అనే మంత్రాన్ని జపించండి.

కుంభ రాశి ఫలాలు : నిరాశగా ఉంటుంది. అనారోగ్య సూచన కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య మనస్పర్థలు. మిత్రులతో విందులు, వినోదాలలో పాల్గొంటారు. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా ఆటంకాలు కలుగుతాయి. శ్రీదేవి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం కోసం తీవ్రంగా కష్టపడుతారు. నిర్లక్ష్యంగా చేసే పనుల వల్ల నష్టపోతారు. ఆర్థిక ఇబ్బందులు. అమ్మతరపు వారి నుంచి ఇబ్బందులు. ప్రయాణ సూచన కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది